పోలవరంపై నిపుణుల కమిటీ నివేదికను సర్కార్ నమ్మడం లేదట..!

ఆ కమిటీ నివేదికను చూపించి పోలవరం కాంట్రాక్టులను జగన్మోహన్ రెడ్డి సర్కార్ రద్దు చేసింది. ఎక్కడికి వెళ్లినా ఆ కమిటీ నివేదికనే ప్రస్తావిస్తున్నారు. చివరికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకూ ఇచ్చారు. ఆ కమిటీ నివేదికను.. జగన్ భాషలో చెప్పాలంటే.. ఖురాన్, భగవద్గీత, బైబిల్‌గా భావించిన.. ఏపీ సర్కార్.. ఇప్పుడు… దానితో ఏకీభవించలేమని.. కేంద్రానికి సమాచారం పంపింది. అదే జగన్ బంధువు రేమండ్ పీటర్ నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదిక. ఈ నివేదికతో తాము ఏకీభవించడం లేదని… ఏపీ ప్రభుత్వం కేంద్రానికి సమాచారం పంపినట్లుగా తెలుస్తోంది. కేంద్రం నుంచి పదే పదే హెచ్చరికలు వచ్చిన తర్వాత.. ఓ నివేదికను సీల్డ్ కవర్‌లో కేంద్రానికి పంపారు. అందులో ఉన్న వివరాలు.. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విస్మయానికి గురి చేశాయని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది.

తప్పుడు సమాచారం వల్లే యూటర్న్ తీసుకుంటున్నారా..?

పోలవరం రివర్స్ టెండరింగ్ కు అనుమతించాలంటూ… కొద్ది రోజుల క్రితం.. ప్రధాని మోడీని, హోంమంత్రి అమిత్ షాను… కొన్నాళ్ల కిందట జగన్ కలిసినప్పుడు.. కోరారు. ఎందుకంటే.. అందులో టీడీపీ హయాంలో అవినీతి జరిగిందని చెప్పుకొచ్చారు. దానికి సాక్ష్యంగా… నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో ఉన్న ఆరోపణలకు ఆధారాలు కావాల్సిందేనని.. పీఎంవో.. వివరణ అడగడం ప్రారంభించింది. కానీ ఆధారాలు లేకపోవడంతో… నాన్చుతూ వచ్చిన ఏపీ సర్కార్… ఇప్పుడు మాట మార్చింది. ఆ నివేదికతో ఏకీభవించడం లేదనే సమాధానం పంపింది. తాము గాలి ఆరోపణలతో… నివేదిక ఇస్తే.. దాన్ని నమ్మేసి.. పోలవరం కాంట్రాక్టులను కేంద్రం రద్దు చేస్తుందని… ఆశ పెట్టుకున్న జగన్ కు షాక్ తగలడంతో.. ఇప్పుడు.. ఆ నిపుణుల కమిటీ నివేదికపైనే నమ్మకం లేదని.. చెప్పుకొస్తున్నట్లుగా అధికారవర్గాలు భావిస్తున్నాయి.

ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు ఉన్నతాధికారులు నో చెప్పారా..?

ఈ వ్యవహారంలో తమ పాత్రమీ లేదని… తాము ఇరుక్కోవడానికి సిద్ధంగా లేమని… జనవనరుల శాఖ ఉన్నాతాధికారులు… ప్రభుత్వ పెద్దలకు స్పష్టం చేయడంతోనే… ఏకీభవించడం లేదనే… వాదనతో.. నివేదిక కేంద్రానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. వాటిలో ఉన్నవన్నీ.. తప్పుడు సమాచారం.. తప్పుడు ఆరోపణలు అని తెలిస్తే.. సర్వీసులో ఉన్న ఉన్నతాధికారులు తీవ్ర పరిణామాలను.. చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే… నిపుణుల కమిటీ విషయంలో తమను ఇన్వాల్వ్ చేయవద్దని అధికారులు స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం.. తేడా వస్తే.. నిపుణుల కమిటీ పేరుతో నియమితులై… జగన్ చెప్పిన మాటల్నే నివేదికగా ఇచ్చిన రేమండ్ పీటర్ కమిటీ బుక్కయ్యే అవకాశం ఉంది. అయితే.. దీనికి చట్టబద్ధత లేదు కాబట్టి… వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేరనే వాదన.. ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది.

రివర్స్ పై త్వరలోనే తేల్చనున్న కేంద్రం..!

అయితే కేంద్రం వదిలి పెట్టలేదు. రివర్స్ టెండర్ల కోసం… కారణంగా చెబుతున్న ” స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ” ను పెంచడం ద్వారా పోలవరం సాగునీటి ప్రాజెక్టులో రూ.1331 కోట్లు, జల విద్యుత్కేంద్రంలో రూ.1015 కోట్లు అదనంగా కాంట్రాక్టరుకు చెల్లించేందుకు ఆస్కారం కల్పించిందని నిపుణుల కమిటీ పేర్కొంది. నాటి కేంద్ర జల వనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ.. కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీతో జరిగిన సమావేశాలు.. తీసుకున్న నిర్ణయాలపై… పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ నుంచి.. పూర్తి వివరాలు కోరింది. ఇది పీపీఏ ఇచ్చిన తర్వాత ఏపీ సర్కార్ తీరుపై.. కేంద్రం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com