ఆంధ్రప్రదేశ్ ప్రధాన పట్టణాల్లో ఒకటి తిరుపతి, కార్పొరేషన్ నుంచి గ్రేటర్ గా మార్చి పట్టణాన్ని మరింత విస్తరించి సకల సౌకర్యాలు ఉన్న సిటీగా మార్చాలని చాలా కాలంగా డిమాండ్లు ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. తాజాగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో 63 గ్రామపంచాయతీల విలీన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత 30.17 చ.కి.మీ. నుంచి 283.80 చ.కి.మీ.కి విస్తరణ, 4.5 లక్షల నుంచి 7.5 లక్షల మందులకు జనాభా పెరుగుదల, ఆదాయం రూ.149 కోట్ల నుంచి రూ.182 కోట్లకు చేరే అవకాశం ఉంది.
తిరుపతి విస్తరణ ప్రతిపాదన 2010లోనే చర్చలోకి వచ్చింది. నగర హద్గులు దాటి వేగంగా అభివృద్ధి చెందుతోంది. టీడీపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రోడ్లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి సుందరమైనసిటీగా మార్చాలని నిర్ణయించింది. తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు మండలాలతో పాటు చంద్రగిరి, రేణిగుంట వంటి పెద్దవి సహా 63 పంచాయతీలు కార్పొరేషన్ లో భాగం అవుతాయి. గ్రేటర్ తిరుపతి ఏర్పాటుతో నగరం మహా నగరంగా మారి, రాయలసీమలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా నిలుస్తుంది.
పంచాయతీలు విలీనం కావాలంటే తీర్మానాలు చేయాలి. కోర్టు కేసులు పడకపోతే ప్రక్రియ త్వరగా పూర్తవుతుంది. రోడ్లు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నిర్వహణ మెరుగుపడతాయి. కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు ఓటింగ్ డిమాండ్ చేసి, ప్లకార్డులు పట్టుకుని వ్యతిరేకించారు. చంద్రగిరి, తిరుపతి రూరల్ మండలాల పంచాయతీల్లో వైసీపీ నేతలు పన్నులు, అవినీతి భయాలతో ప్రచారం చేస్తున్నారు. ఈ సమస్యలను పరిష్కరిస్తే విలీనం పూర్తవుతుంది.
తిరుపతిలో జనాభా వేగంగా పెరుగుతోంది. రియల్ ఎస్టేట్ రేణిగుంట దాటి..తిరుపతి పట్టణంగానే చెప్పుకునేంతగా ఎదిగింది.అందుకే వీలైనంత త్వరగా గ్రేటర్ గా మార్చి క్రబద్దీకరిస్తే.. మరింత వేగంగా నగర్ విస్తరణ, రియల్ ఎస్టేట్ అభివృద్ధి ఉంటాయని భావిస్తున్నారు.
