సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. గత పదేళ్లు విధ్వంసాల నుంచి మెల్లగా పునాదుల్ని మళ్లీ నిర్మించుకుంటూ వస్తున్నారు. ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఏపీలో పెరుగుతున్న ఆర్థిక కార్యక్రమాలు ప్రజల కొనుగోలు శక్తి కారణంగా జీఎస్టీ ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది. ఈ ఏడాది మొత్తం లక్ష్యంగా నిర్దేశించుకున్న జీఎస్టీని వసూళ్లలో తొలి నాలుగు నెలల్లోనే 61 శాతం వసూళ్లను ఏపీ సాధించింది. కాగ్ ఈ లెక్కలను విడుదల చేసింది.
ఏపీ బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సంలో 21 వేల కోట్లకుపైగా జీఎస్టీ ఆదాయాన్ని అంచనా వేసింది. ఇందులో 12. వేల కోట్లకుపైగా తొలి నాలుగు నెలల్లోనే వచ్చింది. అంటే మరో రెండు నెలల్లోనే .. అంటే ఆరు నెలల్లోనే ఏడాది మొత్తం లక్ష్యంగా పెట్టుకున్న జీఎస్టీని ఆదాయంగా చూడనుంది. ఇది అసాధారణ సంఖ్యలు. ఎందుకంటే…జీఎస్టీ పూర్తిగా వ్యాపార కార్యకలాపాలు, ప్రజల కొనుగోలు శక్తి మీద ఆధారపడి ఉంటుంది. లావాదేవీలు ఎక్కువ జరిగితేనే జీఎస్టీ ఆదాయం వస్తుంది. జీఎస్టీతో పాటు రిజిస్ట్రేషన్, ఇతర ఆదాయాలు పెరుగుతున్నాయి. ఇదంతా ఏపీ గాడిలో పడుతున్న దానికి సంకేతాలు.
అదే సమయంలో ఏపీకి అప్పుల భారం కూడా పెరుగుతోది. చేస్తున్న అప్పుల్లో అరవై శాతం గత అప్పులకు వడ్డీలు, వాయిదాలు చెల్లించడానికే సరిపోతుంది. అయినా వీలైనంత ఎక్కువగా మూలధన ఖర్చును ప్రభుత్వం చేస్తోంది. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా.. గాడిలో వేసి.. మెల్లగా రాష్ట్రాన్ని వృద్ధిపథం వైపు నడిపిస్తున్నారు. వచ్చే రెండు, మూడేళ్లలో ఎవరూ ఊహించని స్థాయిలో ఆంధ్ర ఆర్థిక వృద్ధి ముందుకు సాగే అవకాశం ఉంది.