శానిటరీ నాప్కిన్స్‌పై జీఎస్టీ తొలగింపు..! ఇప్పుడెందుకు గుర్తొచ్చిందబ్బా..?

శానిటరీ నాప్‌కిన్స్‌పై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని రద్దు చేసింది. అంతకు ముందు ఇది పన్నెండు శాతం పన్ను పరిధిలో ఉంది. మిగతా వస్తువుల సంగతేమైనా కానీ.. ఈ శానిటరీ నాప్‌కిన్స్‌పై కేంద్రం జీఎస్టీ విధించడంపై… మొదట్లోనే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. శానిటరీ నాప్‌కిన్స్‌ను ఓ విలాస వస్తువు అన్నట్లుగా కేంద్ర ఆర్థిక పరిగణించింది. బంగారంపై కేవలం మూడు శాతమే జీఎస్టీ ఉంది. కానీ ఈ శానిటరీ నాప్‌కిన్స్‌పై మాత్రం పన్నెండు శాతం పన్ను విధించారు. సెలబ్రిటీల దగ్గర్నుంచి ఎంతో మంది తమ నిరసన వ్యక్తం చేశారు. అయినా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఇప్పటి వరకూ… పన్ను కొనసాగుతూనే ఉంది. కానీ హఠాత్తుగా ఇప్పుడు పన్ను నుంచి మినహాంపునిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

శానిటరీ నాప్‌కిన్స్‌పై 12 శాతం పన్ను విధించినప్పుడు.. దేశంలోని అన్ని వర్గాలు.. తమ నివరసన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించేలా ఉందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వెలిబుచ్చారు. రుతుక్రమంలో పరిశుభ్రత ఎంతో అవసరమని పన్నులు వేయడం వల్ల వినియోగం తగ్గిపోతుందన్నారు. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిపై వస్తుసేవల పన్ను నుంచి పూర్తిగా తొలగించాలని ఇతర వర్గాలూ డిమాండ్ చేశాయి.

వ్యక్తిగత శుభ్రతపై మహిళల్లో ఇప్పుడిప్పుడే అవగాహన పెంపొందుతోందని ఇదే సమయంలో వాటిని తక్కువ ధరకు, వీలైతే ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని… సామాజిక నిపుణులు ప్రభుత్వంపై విమర్శలుచేశారు. ఈ అంశంపై నిరసన తెలుపుతూ ముంబైలో కొంతమంది మహిళలు నిరాహార దీక్ష కూడా చేశారు. అప్పుడు ఈ డిమాండ్లపై అరుణ్ జైట్లీ పుల్లవిరుపుగా సమాధానాలు చెప్పారు. ప్రభుత్వంపై అరిచి అరిచి… అందరూ ఊరుకున్నారు. కానీ ఎన్నికల సమయంలో మళ్లీ తెర మీదకు వస్తుందనుకున్నారేమో కానీ హఠాత్తుగా జీఎస్టీని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే.. ప్రజల ఆందోళనలు లేవనెత్తినప్పుడు.. లైట్ తీసుకున్న కేంద్రం… ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయనేసరికి సర్దుకుంది. ఇదీ మోడీ మార్క్… పాలన..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.