ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న పెట్టుబడులు, పారిశ్రామిక విజయాలను తమ ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ నేతలు పడుతున్న తాపత్రయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరగగానే వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సహా పలువురు నేతలు పాత ఫోటోలను బయటకు తీశారు. జగన్ ఓ సారి విహారయాత్రకు వెళ్లి పనిలో పనిగా దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరైనప్పుడు అక్కడ ఆదిత్యమిట్టల్ తో ఓ ఫోటో దిగారు. ఆ ఫోటోను చూపించి.. జగన్ అప్పుడే మాట్లాడారు.. అది మాఘనతే అని సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారు వైసీపీ నేతలు.
ఐదేళ్లలో ఏపీలో ఒక్కటంటే ఒక్క భారీ పరిశ్రమ కూడా రాలేదు, ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి. కేవలం ఫోటో దిగితే పరిశ్రమలు వచ్చేస్తాయా.. ఆ లెక్కన చూస్తే దావోస్‌లో దిగిన ఫోటోలన్నింటికీ పరిశ్రమలు వచ్చి ఉంటే ఏపీ ఎప్పుడో అమెరికా అయిపోయేదనే సంగతిని అమర్నాథ్ మర్చిపోయాడు. గూగుల్ ఏఐ హబ్ విషయంలోనూ ఇదే తరహాలో క్రెడిట్ చోరీకి ప్రయత్నించిన వైసీపీ, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలోనూ అదే పంథాను ఎంచుకుంది.
వైసీపీ నేతల తీరుపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. గూగుల్, మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పుడు చంద్రబాబు నాయుడిపై ఉన్న నమ్మకంతోనే ఏపీ వైపు చూస్తున్నాయని, పాత ఫోటోలను చూపిస్తూ క్రెడిట్ కొట్టేయాలని చూడటం సిగ్గుచేటని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం వేగంగా పారిశ్రామిక నిర్ణయాలు తీసుకుంటూ, పెట్టుబడులను ఆకర్షిస్తుండటంతో వైసీపీ నేతల్లో అభద్రతాభావం మొదలైందని తెలుస్తోంది. తమ హయాంలో ఒక్క ఇటుక కూడా పడని చోట, ఇప్పుడు వేల కోట్ల ప్రాజెక్టులు వస్తుంటే తట్టుకోలేక ఈ ఫోటో డ్రామాలు ఆడుతున్నారు.

