తాను కట్టించిన మెడికల్ కాలేజీలను ఎవరైనా ఆగి ..చూసి.. ఆహా అని అంటారని జగన్ రెడ్డి ప్రెస్మీట్లో యాక్టింగ్ చేసి మరీ చూపించారు. జగన్ రెడ్డిని చూసి స్ఫూర్తి పొందిన గుడివాడ అమర్నాథ్ వెంటనే ప్రజలకు అలాంటి ఫీలింగ్ తెప్పించాలని డిసైడయ్యారు. జగన్ రెడ్డి చెప్పింది నిజమేనని తన అనుచరుల్ని తీసుకుని నర్సీపట్నం మెడికల్ కాలేజీ దగ్గరకు వెళ్లారు. అక్కడ ఫోటోలు దిగారు. వీడియోలు తీసుకున్నారు. సెల్ఫీల దిగి సోషల్ మీడియాలోనూ పోస్టు చేసుకున్నారు.
నర్సీపట్నం మెడికల్ కాలేజీ వైభవాన్ని గుడివాడ అమర్నాథ్ .. చూపించారు. వాటిని చూసి సోషల్ మీడియాలో అందరూ.. .ఆగి..చూసి..ఆహా అంటున్నారు. ఆ కాలేజీల్లో చాలాభాగానికి పిల్లర్లు మాత్రమే వేశారు. కొంత భాగానికి శ్లాబులు వేసి వదిలేశారు. బిల్లులు ఇవ్వకపోవడం.. కేంద్రం ఇచ్చిన నిధుల్ని జగన్ రెడ్డి సర్కార్ మళ్లించడంతో వాటికి డబ్బుుల లేకుండా పోయాయి. ఆ కాలేజీ భవనాల ముందు ఏ మాత్రం సిగ్గుపడకుండా గుడివాడ అమర్నాత్ ఫోటోలు దిగారు.
ఆయన తీరును చూసి వైసీపీ నేతలుకూడా ఆశ్చర్యపోయారు. అక్కడ ఏముందని ఆయన ఫీల్డ్ విజిట్ కు వెళ్లి .. టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారానికి బలం కల్పించారని ప్రశ్నిస్తున్నారు. ఒక్క పులివెందుల మెడికల్ కాలేజీ తప్ప.. మిగిలిన పదహారు కాలేజీలు నిర్మాణాలు పూర్తి కాలేదు. పదిహేను కాలేజీలకు పునాదులు వేసి వదిలి పెట్టారు. ఇలాంటి ఘోరమైన స్థితిలో కాలేజీలో ఉంటే.. తాను పదిహేడు కాలేజీలు కట్టానని జగన్ రెడ్డి ఏ మాత్రం సిగ్గుపడకుండా చెప్పుకుంటున్నారు. గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్లు అదంతా ఫేక్ అని ఫ్యాక్ట్ చెక్ చేసి చూపిస్తున్నారు.
