ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ కాదు గుజరాతీ సినిమా !

ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అావార్డుల బరిలో మంచి ఫలితాలు వస్తాయని సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే ఇండియాలోనే అసలైన అడ్డంకిని ట్రిపుల్ ఆర్ అధిగమించలేకపోయింది. ఇండియా తరపున అధికారిక ఆస్కార్ ఎంట్రీగా గుజరాతీ సినిమా ” చెల్లో షో “ను ఎంపిక చేశారు. చెల్లో షో అంటే ” ఆఖరాట ” అని అర్థం. ఓ చిన్న పిల్లవాడు సినిమాలపై ఇష్టంతో ఆపరేటర్‌కు లంచం ఇచ్చి ప్రొజెక్టర్ రూమ్‌లో సినిమాలు చూస్తూ.. తన కలల్ని ఎలా నెరవేర్చుకున్నాడన్నది సినిమా కథ. దీన్ని ఆస్కార్‌కు పంపాలని కమిటీ నిర్ణయించుకుంది.

ట్రిపుల్ ఆర్ సినిమా భారత్ తరపున అధికారిక ఎంట్రీ అయితే .. ఉత్తమ విదేశీ కేటగిరి చిత్రంలో పోటీ పడేది. అయితే ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. కానీ విడిగా ఆస్కార్ అవార్డుల కోసం పోటీ పడవచ్చు. అకాడమీ అవార్డులు దేశాలకు సంబంధించినవి కావు. ఇంగ్లిష్‌లో విడుదలైన సినిమాలన్నీ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందు కోసం కొన్ని అర్హతలు ఉంటాయి. వాటిని ట్రిపుల్ ఆర్ టీం చాలా ఖర్చు పెట్టి మరీ సాధించింది. ఆ మేరకు ఎంట్రీలు పంపినట్లుగా తెలుస్తోంది. అయితే దేశం తరపునే ఆస్కార్ కోసం పోటీ పడే సినిమాగాఎంపిక కాకపోవడంతో ఆర్ఆఆర్‌ఆర్‌ అసలైన వేదిక మీద ఎలాంటి చాన్సులు ఉంటాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఆస్కార్ బరిలో గతంలో ఆర్ట్ తరహా సినిమాలకు అధిక ప్రాధాన్యం లభించేది. అవార్డులు వచ్చేవి. కానీ కాలక్రమంలో ఆస్కార్ జ్యూరీలో కూడా మార్పులు వచ్చాయి. కమర్షియల్‌గా హిట్ అయిన.. మంచి సెన్సిబుల్ సినిమాలకూ పెద్ద ఎత్తున పురస్కారాలు లభిస్తున్నాయి. ఈ కోణంలో ఆర్ఆర్ఆర్‌ కు … టెక్నిషియన్స్‌కు నటులకూ మంచి చాన్సులున్నాయని అనుకుంటున్నారు. కానీ ఆ సినిమాకు మొదటి సెట్ బ్యాక్ ఇండియా నుంచే తగిలింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close