గుణ‌శేఖ‌ర్ ఈ భారాన్ని ఎందుకు మోస్తున్నాడో?

గుణ‌శేఖ‌ర్ మంచి మేక‌ర్‌. అంత‌కంటే మంచి క‌థ‌కుడు. త‌న స్క్రీన్ ప్లే బాగుంటుంది. చూడాల‌ని ఉంది, ఒక్క‌డు, అర్జున్ లాంటి చిత్రాల్లో బ‌ల‌మైన క‌థ‌లుంటాయి. అయితే.. ఈమ‌ధ్య టెక్నిక‌ల్ విష‌యాల‌పైనే గుణ‌శేఖ‌ర్ ఫోక‌స్ పెడుతున్న‌ట్టు అనిపిస్తోంది. దానికి పెద్ద ఉదాహ‌ర‌ణ `రుద్ర‌మదేవి`. పైకి గుణ‌శేఖ‌ర్ ఎప్పుడూ చెప్పుకోలేదు కానీ, బాహుబ‌లికి ధీటుగా ఈ సినిమాని తీద్దామ‌నుకొన్నాడు గుణ‌. అందుకు త‌గిన‌ట్టుగానే పాపుల‌ర్ తారాగ‌ణాన్ని ఎంచుకొన్నాడు. సొంత నిర్మాణ సంస్థ ద్వారా భారీగా ఖ‌ర్చు పెట్టి మ‌రీ తీశాడు. `బాహుబ‌లి`కీ `రుద్ర‌మ‌దేవి`కీ సాంకేతికంగా తేడా క‌నిపించాల‌న్న ఉద్దేశంతో `రుద్ర‌మ‌దేవి`ని త్రీడీలో రూపొందించాడు. అయితే ఆ త్రీడీ ఎఫెక్టులు పెద్ద‌గా క‌నిపించ‌లేదు. త్రీడీ కోసం సినిమా ఆల‌స్య‌మైంది. ఖర్చు పెరిగింది. అయినా పెద్ద‌గా ఒరిగిందేం లేదు. అంత‌కు ముందే క‌ల్యాణ్ రామ్ `ఓం` సినిమాని త్రీడీలో తీశాడు. అది కూడా అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. త్రీడీ ఎఫెక్టులు ఆ సినిమాకి క‌ల‌సి రాలేదు. తెలుగులో రాజ‌మౌళి కూడా త్రీడీ అంటే భ‌య‌ప‌డిపోతాడు. ఆ జోలికి ఏమాత్రం వెళ్ల‌డు. పైగా మ‌న వాళ్లు త్రీడీ ఫార్మెట్ కు పెద్ద‌గా అడాప్ట్ కాలేద‌నిపిస్తుంది కూడా. అయినా స‌రే, గుణ‌శేఖ‌ర్ ఇప్పుడు `శాకుంత‌ల‌మ్‌`ని త్రీడీలో చూపించాల‌న్న నిర్ణ‌యం తీసుకొన్నాడు. దీని వ‌ల్ల ఇంకొంత డ‌బ్బు, స‌మ‌యం ఖ‌ర్చ‌వుతాయి. అందుకు త‌గిన ప్ర‌తిఫ‌లం ఉంటుందా అంటే ఆ గ్యారెంటీ లేదు. పైగా ఇప్ప‌టికే ఈ సినిమాపై బాగా ఖర్చుపెట్టాడు గుణ‌శేఖ‌ర్‌. త్రీడీతో మ‌రింత బ‌డ్జెట్ పెరుగుతుంది. అయినా ఈ రిస్క్ ఎందుకు చేస్తున్నాడో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎగ్జిట్ పోల్స్ : గుజరాత్‌లో మళ్లీ బీజేపీ – హిమాచల్‌లో టఫ్ ఫైట్ !

రెండు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే మొగ్గు కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్‌లో పోలింగ్ నెలకిందటే ముగిసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంది. గుజరాత్...

రోజాకు ఇంత అవమానమా !

మంత్రి రోజా అంటే ఫైర్ బ్రాండ్. నోరు తెరిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఆ నోరుకు భయపడే మంత్రి పదవి ఇచ్చారనే టాక్ కూడా ఉంది అది వేరే విషయం. కానీ మంత్రి...

3 రాజధానులు కాదు 3 రాష్ట్రాలు చేయాలన్న పయ్యావుల !

రాయలసీమ గర్జన పేరుతో వైసీపీ నిర్వహించిన సభ ద్వారా ప్రజల మూడ్ ఏమిటో వైసీపీ పెద్దలకు అర్థమయ్యే ఉంటుందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సెటైర్ వేశారు. సీమ గర్జన పేరుతో...

విజయ్ ఫ్యామిలీతో జాన్వీ కపూర్ బాండింగ్

విజయ్‌ దేవరకొండ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ వుంది. లైగర్ సినిమాకి ముందే విజయ్ అక్కడ క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విజయ్ అంటే ఇష్టపడతారు. జాన్వీ కపూర్ కి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close