గుణశేఖ‌ర్‌కి ‘హిర‌ణ్య‌క‌శ్య‌ప’ దొరికేశాడు

రుద్ర‌మ‌దేవి త‌ర‌వాత‌… గుణ‌శేఖ‌ర్ మ‌రో భారీ ప్రాజెక్ట్ రూపొందించే ప‌నిలో ప‌డిపోయాడు. ఈసారి గుణ‌శేఖ‌ర్ దృష్టి పౌరాణికాల‌పై ప‌డింది. ‘హిర‌ణ్య‌క‌శ్య‌ప‌’ అనే స్క్రిప్టు సిద్ధం చేస్తున్నారు గుణ‌. ఈ సినిమాని అంతర్జాతీయ సాంకేతిక నైపుణ్యంతో తెర‌కెక్కించాల‌ని ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారు. హిర‌ణ్య‌క‌శ్య‌ప‌గా ఓఅగ్ర క‌థానాయ‌కుడు న‌టిస్తార‌ని ఎప్ప‌టి నుంచో చెబుతూ వ‌స్తున్నారాయ‌న‌. ఇప్పుడు ఆ హీరో దొరికేశాడు. హిర‌ణ్య‌క‌శ్య‌ప‌గా రానా క‌నిపించ‌నున్నాడు. ఇటీవ‌ల రానాతో గుణ‌శేఖ‌ర్ భేటీ అవ్వ‌డం, స్క్రిప్టు మొత్తం వివ‌రించ‌డం జ‌రిగిపోయాయి. ఈ సినిమా చేయ‌డానికి రానా కూడా అంగీకారం తెలిపాడు. ‘రుద్ర‌మ‌దేవి’లో రానా ఓ కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. ఆ అనుబంధంతోనే గుణ‌శేఖ‌ర్‌తో మ‌ళ్లీ జ‌ట్టు క‌ట్ట‌డానికి రానా ముందుకొచ్చాడ‌ని తెలుస్తోంది. ‘రుద్ర‌మ‌దేవి’ త‌ర‌వాత ‘ప్ర‌తాప‌రుద్రుడు’ క‌థ‌ని తెర‌కెక్కిస్తాన‌ని చెప్పాడు గుణ‌. ఎందుక‌నో.. అది ప‌క్క‌కు వెళ్లి `హిర‌ణ్య క‌శ్య‌ప‌` తెర‌పైకొచ్చింది. అతి త్వ‌ర‌లో ఈ ప్రాజెక్ట్‌లోరానా ఎంట్రీపై ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close