గుంటూరు జిల్లా టీడీపీలో చేరికల హుషారు !

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వైసీపీ పూర్తిగా బలహీనపడుతోంది. ఆ పార్టీ నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా వరుసగా టీడీపీలో చేరిపోతున్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అనేక మంది టీడీపీలో చేరుతున్నారు. ఫలితంగా స్థానిక సంస్థల్లో బలబలాలు మారిపోతున్నాయి.

జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ క్రిస్టినాతోపాటు ఇప్పటివరకు 8 మంది జడ్పీటీసీలో టీడీపీలో చేరారు. పలువురు ఎంపీపీలూ అదే పని చేశారు. అనేక మండలాల్లో టీడీపీ మెజార్టీలోకి వచ్చింది. అమరావతి ఎంపీపీ, డిప్యూటీ ఎంపీపీ కూడా టీడీపీలో చేరారు. గుంటూరు కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్‌ సజీలాతోపాటు 8 మంది కార్పొరేటర్లు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. గుంటూరు మేయర్ చిలుకలూరిపేట అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన గుంటూరు వచ్చే సరికి ఆయన మేయర్ పదవి పోయే పరిస్థితి ఏర్పడింది. గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు, ఆయన సోదరుడు, మాజీ డిప్యూటీమేయర్‌ తాడిశెట్టి మురళీ కూడా టీడీపీలో చేరారు. గుంటూరు తూర్పులో మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభానీ, ఆయన కుమారుడు మాజీ డిప్యూటీ మేయర్‌ గౌస్‌ పసుపు కండువా కప్పుకున్నారు. చిలు కలూరిపేటలో సమన్వయకర్తగా ఉన్న మల్లెల రాజేష్‌ నాయుడు టిక్కెట్‌ రాకపోవడం తో టీడీపీలో చేరారు. ఆయనతోపాటు పలువురు కౌన్సిలర్లు, జెడ్‌పీటీసీని టీడీపీలోకి తెచ్చారు.

తెనాలి, చిలకలూరిపేటతో పాటు మునిసిపాలిటీలలో కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో అక్కడా టీడీపీకి ఆధిక్యం వచ్చింది. లావు శ్రీకృష్ణదేవరాయులు వెంట పల్నాడులో వైసీపీ క్యాడర్ టీడీపీలోకి వచ్చింది. పల్నాడులో దౌర్జన్యాలతో వచ్చిన విజయాలతో కూడా నిలబడటం లేదు. జంగా కృష్ణమూర్తి రాకతో గురజాలలో స్థానిక సంస్థల్లో టీడీపీదే పైచేయి అవుతోంది. తాడికొండలో ఎమ్మెల్యే శ్రీదేవి, వైసీపీ సమన్వయకర్తలుగా పనిచేసిన డొక్కా మాణిక్య వర ప్రసాద్‌, కత్తెర సురేష్‌ కూడా టీడీపీలో చేరారు. వారి అనుచరులుగా ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధులు టీడీపీ గూటికి చేరారు. వైసిపికి గుడ్‌బై చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకట రమణ కూడా టీడీపీలో చేరారు. రమణ అనుచరులు టీడీపీకి పనిచేస్తున్నారు.

గుంటూరు జిల్లాలో ఈ చేరికలన్ని ప్రభుత్వం మారడం ఖాయమని నిర్ణయానికి రావడంోత.. తర్వాత వచ్చే ప్రభుత్వం నుంచి పదవులు కాపాడుకోవడానికేనన్న చెబుతున్నారు . వైసీపీ ఓటమి ఖాయమని అంతా గట్టిగా నమ్ముతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close