లీకైన పాట… రిలీజ్‌కి రెడీ!

గుంటూరు కారం నుంచి అఫీషియ‌ల్ గా ఒక్క పాట కూడా బ‌య‌ట‌కు రాలేదు. లీకేజీ రూపంలో మాత్రం ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేసింది. గుంటూరు కారం నుంచి ఓ పాట లీకై… సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ దీపావ‌ళికి ఈ పాట‌ని విడుద‌ల చేద్దామ‌నుకొంది చిత్ర‌బృందం. స‌డ‌న్ గా లీకైపోవ‌డంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు షాక్ అయ్యారు. లీకైన పాట‌ని ఇప్పుడు మ‌ళ్లీ ఫ్రెష్ గా రిలీజ్ చేయాలా, లేదంటే కొత్త పాట రెడీ చేయాలా? అనే సందిగ్థంలో ప‌డ్డారు. త‌మ‌న్ ఇంకా పూర్తి స్థాయిలో పాట‌ల్ని సిద్దం చేయ‌క‌పోవ‌డంతో లీకైన పాట‌నే రిలీజ్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఫ‌స్ట్ సింగిల్ ప్రోమో వ‌చ్చేసింది. లీకైన పాట‌.. ఇదీ ఒకటే. ఈనెల 7న పూర్తి పాట విడుద‌ల చేస్తారు. మంచి మాస్ బీట్ తో సాగే పాట ఇది. బిరియానీ, గ‌రం మ‌సాలా, అర‌కోడీ, బీడీ అంటూ.. పదాలు ప్రాస వెతుక్కొంటూ సాగాయి. పాట‌కు ముందొచ్చే సాకీ మాత్ర‌మే విన్నాం. పాట ఇంకే స్థాయిలో ఉంటుందో తెలియాలంటే ఈనెల 7 వ‌ర‌కూ ఆగాల్సిందే. అల వైకుంఠ‌పురం కోసం త‌మ‌న్ ఇచ్చిన ఆల్బ‌మ్ సూప‌ర్ హిట్ట‌యి, ఆ సినిమా స్థాయిని పెంచింది. అయితే ఆ త‌ర‌వాత త‌మ‌న్ స్థాయికి త‌గ్గ పాట‌లు రాలేదు. మ‌రి.. ఈసారైనా త‌మ‌న్ త‌నపై త్రివిక్ర‌మ్ పెట్టుకొన్న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకొంటాడో లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎగ్జిట్ పోల్స్ : తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉందని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నయి. దేశంలో అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో కూడా కాంగ్రెస్ కే అడ్వాంటేజ్ లభించింది. జాతీయ మీడియాలు...

ఏపీ పోలీసులతో సాగర్ గేట్లు ఎత్తేయించి జగన్ రెడ్డి సాధించిందేంటి ?

తెలుగుదేశం పార్టీ నేతలను అరెస్టు చేయాలంటే వారు అందుబాటులో ఉన్నా సరే. అర్థరాత్రి వాళ్లు నిద్రపోయిన తర్వాత గేట్లు దూకి, తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేస్తారు. అది కోర్టులో నిలబడని కేసు.....

ప్రాసెస్‌లో క్వాష్ పిటిషన్‌పై తీర్పు : సుప్రీంకోర్టు ధర్మాసనం

చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై తీర్పు ప్రాసెస్ లో ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఫైబర్ నెట్ స్కాంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై...

తెలంగాణ ఓటరు నిరాసక్తత

తెలంగాణ ఓటరు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పెద్ద పెద్ద క్యూలైన్లు ఎక్కడా కనిపించడం లేదు. మధ్యాహ్నం ఒంటింగంట వరకూ పోలింగ్ పర్సంటేజీ కేవలం 37 శాతం వరకే ఉంది. 2018లో ఇది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close