తను రాసిన పుస్తకంపై జీవీఎల్ క్షమాపణ చెబుతారా..?

ఈవీఎంలకు మద్దతుగా జీవీఎల్ నరసింహారావు… తనకు మాత్రమే సాధ్యమైన లాజిక్కులతో.. మీడియా సమావేశాల్లో ఊగిపోతున్నారు. గెలిచినప్పుడు.. ఈవీఎంలపై అనుమానాలు రాలేదా..? అన్న దగ్గర్నుంచి ప్రజలకు లేని అనుమానాలు మీకెందుకు..? అనే వివరం లేని సందేహం వరకూ.. ఆయన చేస్తున్న విన్యాసాలు అందరిలోనూ… వెగటు పుట్టిస్తున్నాయి. నిజానికి ఈ జీవీఎల్… ఈవీఎంలపై… పోరాడిన చరిత్ర కారుడే. భారత్ వెలిగిపోతోందని… ప్రచారం చేసుకుని గతంలో బీజేపీ భంగపడినప్పుడే.. ఈయనకు .. ఈవీఎంలపై అనుమానాలొచ్చాయి. అప్పుడే… సెఫాలజిస్ట్‌గా తనకు ఉన్న ఇంగ్లిష్ పరిజ్ఞానంతో ఓ పుస్తకం రాసి పడేశారు. దాని పేరు… “డెమెక్రసీ ఎట్ రిస్క్ “. ఈవీఎంల వల్ల ప్రజాస్వామ్యం ఎలా ప్రమాదంలో పడిందో.. సహేతుకంగా వివరిస్తూ.. ఈ పుస్తకం ఉంటుంది. దీనిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో ముందుమాట, ఎల్‌కే అద్వానీతో మరో కీలకమైన అభిప్రాయాన్ని తీసుకుని… మరీ ప్రచురించారు.

డెమెక్రసీ ఎట్ రిస్క్ అనే… జీవీఎల్ విరచిత పుస్తకంలో… ఈవీఎంలను ఎంత సులువుగా.. హ్యాక్ చేయవచ్చో… స్పష్టంగా వివరించారు. ఈ పుస్తకంలో పదహారు చాప్టర్లు ఉంటే… ఆ పదహారు కూడా.. ఈవీఎంలు ఏ కోణంలోనూ… ఎన్నికలకు పనికి రావని నిర్ధారించారు. చివరికి అసలు అవి రాజ్యాంగబద్ధమైనవి కావని తీర్మానించారు. ఇందులో కీలకమైన విషయం ఏమిటంటే.. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని నిరూపించిన…హరికృష్ణ ప్రసాద్ వేమూరు… అనే టెక్నికల్ ఎక్స్‌పర్ట్… జీవీఎల్‌కు చెందిన సంస్థకు టెక్నికల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. ఆయన గతంలో… హ్యాక్ చేసి చూపించారు. ఈసీతో ఈయన వాదనను.. పుస్తకంలో ప్రత్యేకంగా ప్రచురించారు. అప్పుడు… ఈసీ వాదన విన్నది. ఇప్పుడు బీజేపీ హయాంలో.. హరికృష్ణ ప్రసాద్ పై నిందలు వేస్తున్నారు. చివరికి జీవీఎల్ కూడా..!

ఈవీఎం లోపాలపై పోరాడుతున్న చంద్రబాబుపై.. జీవీఎల్ విమర్శలు చేసే ముందు… తాను.. రాసిన పుస్తకంపై.. వివరణ ఇవ్వాలన్న డిమాండ్లు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దేశంలో… ఇప్పటి వరకూ జరిగిన ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోరపరాజయం పాలయింది. కానీ..నేరుగా జరిగిన ఎన్నికల్లో మాత్రం.. భారీ విజయాలు సాధించింది. కర్ణాటకలో… అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ.. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో కంటుకోటల్లో కూడా… దాదాపుగా డిపాజిట్లు కోల్పోయింది. దేశం మొత్తం అంతే ఉంది. ఇప్పుడు.. ఎన్నికల వ్యవస్థపై… దేశంలో.. ప్రజలకు విశ్వాసం సడలిపోతోంది. జీవీఎల్ లాంటి వాళ్లే.. ఆ అనుమానాలకు బీజం వేసి… ఇప్పుడు సమాధానం చెప్పకుండా… సమర్థించడంతోనే… అసలు సమస్య వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో, హెర్బల్ ప్రొడక్ట్స్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close