పిల్లల సినిమాని తీసిపారేయొద్దు!

ఒకప్పుడు బాల సాహిత్యం, బాలల సినిమాలు విశేషంగా అలరించేవి. పత్రికలు బాల సాహిత్యానికి ప్రత్యేక పేజీని కేటాయించేవారు. చందమామ, జాబిల్లి, బాలమిత్ర, బుజ్జాయి, బాలభారతి ఇలా ప్రత్యేకంగా పిల్లల కోస‌మంటూ సాహిత్య ప‌త్రిక‌లు వెలువడేవి. శ్రీనాథుడు నుంచి చిన్నయ సూరి వరకూ, గురజాడ నుంచి ముళ్ళపూడి వరకూ ఎందరో సాహితీవేత్తలు బాల సాహిత్యంలో విశేషంగా సేవలు అందించారు. ముళ్ళపూడి వెంకటరమణకు విశేష గుర్తింపు తెచ్చింది బాల సాహిత్యమే. ఆయన సృష్టించిన బుడుగు క్లాసిక్. కానీ ఇప్పుడు బాల సాహిత్యానికి ఆ ప్రభ లేదనే చెప్పాలి.

ఇక సినిమాల విషయానికి ఒకప్పుడు ప్రత్యేకంగా పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని సినిమాలు తీసేవారు. పెద్ద హీరోల సినిమాల్లో కూడా పిల్లల పాత్రల చుట్టూ కథని నడిపేవారు. పాపం పసివాడు, లిటిల్ సోల్జర్స్, అంజలి, సిసింద్రీ, ఘటోత్కచుడు, ల‌క్ష్మీ- దుర్గ.. ఇవన్నీ పిల్లల సినిమాలే. చిరంజీవి లాంటి మెగాస్టార్ కూడా పసివాడి ప్రాణం, జగదేకవీరుడు అతిలోక సుందరి లాంటి చిత్రాలలో పిల్లల నేపధ్యం తీసుకున్నారు. ‘అమ్మోరు’ లాంటి సూపర్ నేచురల్ మైథలాజికల్ ఫాంటసీలో అమ్మోరు పాప రూపంలోనే వస్తుంది. కానీ రాను రాను ఈ జోనర్ క్రేజ్ కోల్పోయింది. పిల్లల సినిమా అనేసరికి బడ్జెట్ పరిమితులు వుంటాయి. ఒక దశలో మరీ తీసిపారేసినట్లు కొన్ని సినిమాలు తయారు చేసి వదిలారు. దీంతో పిల్లల సినిమాలపై వున్న కాస్త ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో తగ్గిపోయింది.

అయితే సరిగ్గా దృష్టి పెట్టి తీయాలి కానీ.. పిల్లలే పెద్దల చేయిపట్టుకొని థియేటర్స్ కి రప్పించే సత్తా ఈ జోనర్ కి వుందని మరోసారి నిరూపించింది హను-మాన్. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇది పిల్లలు ఎంజాయ్ చేసే సినిమా అని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెబుతుంటే.. ఆ మాటని సరిగ్గా ఎవరూ చెవిన వేసుకోలేదు. ‘’ఇకపై స్పైడర్ మ్యాన్ లా కాదు.. పంచెకట్టుకుంటామని పిల్లలు అడుగరుతారు’ అని హీరో తేజ సజ్జా చెబుతుంటే.. ఆ మాటనీ లైట్ తీసుకున్నారు. మా సినిమాని పిల్లలు చూస్తారు.. పెద్దలే పిల్లల్ని తీసుకొస్తారని టీం అంతా ముక్తకంఠంతో చెబుతుంటే.. ‘’ఇప్పుడు పిల్లల సినిమాలు ఏంటి?’’ అని గొణుక్కున్న‌ వాళ్ళూ వున్నారు. కానీ హనుమాన్ టీం ఎందుకు ఇంత బలంగా ఆ మాటలు చెప్పిందో సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరికీ తెలిసింది.

పిల్లల్ని లటుక్కున ఆకర్షించే కంటెంట్ ఇది. ఎలాంటి అసభ్యత, ద్వందార్థాలు, పెడ ధోరణలు లేని సినిమా ఇది. సినిమాలో డివైన్ టచ్ వుంది. అందుకే పండగ పూట‌ కుటుంబం అంతా కలసి చూడటానికి ఉత్తమమైన ఎంపికగా మారింది. హనుమాన్ కి వస్తున్న కలెక్షన్స్ దీనికి అద్దం పట్టింది. హనుమాన్ లో క్రౌడ్ పుల్లింగ్ స్టార్స్ లేరు. కానీ మౌత్ టాక్ క్రౌడ్ పుల్లర్ గా మారింది. ‘పిల్లలతో కలిసి హాయిగా చూడొచ్చుట’ అనే మాట హనుమాన్ కి శ్రీరామ రక్షగా నిలిచింది. మొత్తానికి హనుమాన్ విజయంతో మళ్ళీ చిల్డ్రన్ జోనర్ కి కొత్త ఉత్సాహం వచ్చింది. సంక్రాంతి లాంటి సీజన్ లో పిల్లలతో పాటు పెద్దల్ని ఆకర్షించే ఇలాంటి వినోదాత్మక చిత్రాలు రూపకల్పనపై మేకర్స్ ఫోక‌స్ చేస్తే మంచి ఫలితాల్ని చూడొచ్చనే నమ్మకాన్ని ఇచ్చింది హనుమాన్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలపై తెలంగాణను మించి ఏపీ పోలీసుల దాష్టీకం – విజయమ్మ స్పందనేమిటో ?

తెలంగాణలో షర్మిల రాజకీయ పోరాటం చేస్తున్న సమయంలో పోలీసులు ఆమెను ఓ సారి ఆపిన సందర్భంలో విజయమ్మ బయటకు వచ్చి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంద్‌కు పిలుపునివ్వమంటారా.. ఆందోళనలు చేయాలని పిలుపునివ్వమంటారా...

28న తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన సమరభేరీ !

తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి ప్రచారానికి సిద్ధమ్యాయి. ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన తాడేపల్లి గూడెంలో ఉమ్మడి బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. విజయవాడలో జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం...

బుర్రా బ్యాన‌ర్… ‘ఎస్‌.ఎం.ఎస్‌’

స్టార్ రైట‌ర్‌.. బుర్రా సాయిమాధ‌వ్ నిర్మాత‌గా మారారు. ఆయ‌న ఎస్‌.ఎం.ఎస్ అనే నిర్మాణ సంస్థ‌ని ప్రారంభించారు. అంటే.. సాయిమాధ‌వ్ స్క్రిప్ట్స్ అని అర్థం. తొలి ప్ర‌య‌త్నంగా ఈటీవీ విన్‌తో క‌లిసి ఓ సినిమాని...

తిరుమల శ్రీవారి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు : రమణ దీక్షితులు

గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వంపై రమణదీక్షితులు చేసిన ఆరోపణల గురించి చెప్పాల్సిన పని లేదు. వాటిని పట్టుకుని వైసీపీ నేతలు చేసిన ఆరోపణలూ శృతి మించాయి. చివరికి టీటీడీ పరువు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close