ఆ విధంగా…. ‘హ్యాపీ’గా గ‌ట్టెక్కేశారు!

ఈమ‌ధ్య డిజిట‌ల్‌, శాటిలైట్ హ‌క్కుల‌కు బాగా గిరాకీ పెరిగింది. వాటి వ‌ల్లే… కొన్ని సినిమాలు ఒడ్డున ప‌డిపోతున్నాయి. గ‌త‌వారం విడుద‌లైన ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌’ ఫ్లాపైంది. అయితే.. నిర్మాత‌ల‌కు పెద్ద‌గా న‌ష్టం వాటిల్ల‌లేదు. ఎందుకంటే ఆ సినిమా డిజిట‌ల్‌, శాటిలైట్ హ‌క్కులు మంచి రేటుకే అమ్ముడైపోయాయి. థియేట‌రిక‌ల్ నుంచి పెద్ద‌గా వ‌సూళ్లు రాక‌పోయినా…నిర్మాత ఇబ్బంది ప‌డ‌లేదు. ఇప్పుడు `హ్యాపీ బ‌ర్త్ డే`కీ అంతే. మైత్రీ మూవీస్ నుంచి వ‌చ్చిన సినిమా ఇది. `మ‌త్తు వ‌ద‌ల‌రా`తో ఆక‌ట్టుకొన్న రితేష్ రానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. లావ‌ణ్య త్రిపాఠి, అగ‌స్త్య‌, స‌త్య ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ సినిమా తొలి రోజే ఫ్లాప్ టాక్ మూట‌గ‌ట్టుకొంది. ఇక ఈ సినిమా థియేట్రిక‌ల్ వ‌సూళ్లు ఆశించ‌డం క‌ష్టం. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయినా నిర్మాత‌లు గ‌ట్టెక్కేశారు. దానికి కార‌ణం… డిజిట‌ల్‌, శాటిలైట్ రైట్సే.

‘మ‌త్తు వ‌ద‌ల‌రా’ హిట్ట‌వ్వ‌డం వ‌ల్ల రితేష్ పై న‌మ్మ‌కం పెరిగింది. దానికి తోడు.. ఈ సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ చిత్రాలు బాగా ఆక‌ట్టుకొన్నాయి. పైగా ప‌బ్లిసిటీ కూడా బాగానే చేశారు. వెరైటీ డిబేట్ల‌తో… ర‌క్తి క‌ట్టించారు. దాంతో సినిమాలో విష‌యం ఉంద‌ని అంతా న‌మ్మారు. అందుకే నాన్ థియేట‌రిక‌ల్ రైట్స్ మంచి రేటుకి అమ్ముడుపోయాయి. పెట్టుబ‌డి మొత్తం వాటితోనే తిరిగొచ్చేసింది. ఇక‌.. థియేట‌రిక‌ల్ నుంచి ఎంతొచ్చినా లాభ‌మే. కాబ‌ట్టి… నిర్మాత‌లు హ్యాపీగా సేఫ్ అయిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎగ్జిట్ పోల్స్ : గుజరాత్‌లో మళ్లీ బీజేపీ – హిమాచల్‌లో టఫ్ ఫైట్ !

రెండు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే మొగ్గు కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్‌లో పోలింగ్ నెలకిందటే ముగిసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంది. గుజరాత్...

రోజాకు ఇంత అవమానమా !

మంత్రి రోజా అంటే ఫైర్ బ్రాండ్. నోరు తెరిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఆ నోరుకు భయపడే మంత్రి పదవి ఇచ్చారనే టాక్ కూడా ఉంది అది వేరే విషయం. కానీ మంత్రి...

3 రాజధానులు కాదు 3 రాష్ట్రాలు చేయాలన్న పయ్యావుల !

రాయలసీమ గర్జన పేరుతో వైసీపీ నిర్వహించిన సభ ద్వారా ప్రజల మూడ్ ఏమిటో వైసీపీ పెద్దలకు అర్థమయ్యే ఉంటుందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సెటైర్ వేశారు. సీమ గర్జన పేరుతో...

విజయ్ ఫ్యామిలీతో జాన్వీ కపూర్ బాండింగ్

విజయ్‌ దేవరకొండ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ వుంది. లైగర్ సినిమాకి ముందే విజయ్ అక్కడ క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విజయ్ అంటే ఇష్టపడతారు. జాన్వీ కపూర్ కి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close