కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగిన ఆలయం ప్రభుత్వ నిర్వహణ లో లేదు. కనీసం దేవాదాయ శాఖకూ తెలియదు. పూర్తిగా ప్రైవేటు స్థలంలో హరిముకుంద్ పాండా ఒడిషా వ్యక్తి నిర్మించారు. పన్నెండు ఎకరాల స్థలంలో ఐదు కోట్లకు పైగా సొంత డబ్బులు పెట్టి ఆలయాన్ని నిర్మించాడు. జూలైలోనే ప్రారంభించాడు. మూడు నెలల్లోనే పెను విషాదం చోటు చేసుకుంది.
ఈ పాండా అనే పెద్దాయన ఆలయం నిర్మించడానికి తిరుమలపై అలగడమే కారణం. ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు.. తనకు తనివితీరా దర్శనానికి అవకాశం కల్పించలేదని ఫీలయ్యారు. కోట్లాది మంది…భక్తులు ఒక్క క్షణం దర్శనం చేసుకుని సంతృప్తి పడుతూంటే ఆయన మాత్రం.. తనకు సంతృప్తికరమైన దర్శనం దొరకలేదని.. ఏకంగా ఆలయ నిర్మాణానికే సిద్ధపడ్డారు. సొంతంగా పన్నెండు ఎకరాలను కొనుగోలు చేసి ఆలయం నిర్మించారు.
ఆయన పంతం నెగ్గించుకున్నారు. ఆయన చేసిన పని వల్ల.. ఆ ఆలయానికి విపరీతమైన ప్రచారం కూడా వచ్చింది. అదే ఇప్పుడు పెను విషాదానికి కారణం అయింది. దేవుడి విషయంలో పంతానికి పోయి ఆ పెద్దాయన చేసిన పని వల్ల ఇప్పుడు పదికిపైగా ప్రాణాలు పోయాయి.
