పంపుసెట్లకు మీటర్లను జగన్ ఎందుకు పెడుతున్నారో చెప్పిన హరీష్ రావు..!

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెడుతున్న వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు అసంతృప్తితో ఉన్నారు. ఇంకా ప్రక్రియ ప్రారంభం కాలేదు.. ఒక వేళ మీటర్లు పెట్టే ప్రక్రియ ప్రారంభమైతే..రైతులు ఎక్కడికక్కడ మీటర్లను ధ్వంసం చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ మేరకు రాజకీయ పార్టీలు ఇప్పటికే పిలుపునిచ్చాయి. అయితే.. సంస్కరణల కోసం… రైతులకు మెరుగైన విద్యుత్ ఇచ్చేందుకు మీటర్లు అని ప్రభుత్ం చెబుతోంది. కానీ.. అసలు విషయం మాత్రం.. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు సడలింపులు తీసుకుని మరింత ఎక్కువగా అప్పు తీసుకోవడానికన్న చర్చ అన్ని చోట్లా జరుగుతోంది.

అయితేపెద్ద మొత్తంలో అప్పు వస్తుందని ఏపీ సర్కార్ ఇలా చేయడం లేదు. కేవలం నాలుగంటే నాలుగు వేల కోట్లమే… రైతులకు మీటర్ల కష్టాన్ని ఏపీ సర్కార్ తెచ్చి పెడుతోందట. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు బహిరంగాగానే చెప్పారు. తెలంగాణకు కేంద్రం రూ.2,500 కోట్ల నిధులు ఇచ్చి.. బోరుబావుల దగ్గర మీటర్లు పెట్టమని చెప్పిందని.. కానీ తాము తిప్పికొట్టామని చెప్పుకొచ్చారు. అదే ఏపీకి రూ.4 వేల కోట్లు ఇస్తామంటే జగన్ ఒప్పుకుని మీటర్లు పెట్టారన్నారు. తెలంగాణతో పోలిస్తే.. ఏపీ కాస్త పెద్ద రాష్ట్ర కాబట్టి… పదిహేను వందల కోట్లను ఎక్కువగా ఏపీకి కేంద్రం ఇస్తుందని అనుకోవచ్చు.

ఇప్పటికే.. తెలంగాణ ప్రభుత్వం మీటర్ల జోలికి వెళ్లడం లేదు…. ఏపీ సర్కార్ ఎందుకు వెళ్లాలన్న సందేహం ఏపీ రైతుల్లో వస్తోంది. జగన్ తీరును.. టీఆర్ఎస్ పక్కాగా ఉపయోగించుకుంటోంది. దుబ్బాక ఉపఎన్నికల అంశంలో బిజీగా ఉన్న హరీష్ రావు ఇదే అంశాన్ని అక్కడి రైతులకు పదే పదే చెబుతున్నారు. తాము మీటర్లు పెట్టబోమని … కేంద్రం ఇచ్చే నిధుల కోసం కక్కుర్తి పడి రైతుల్ని ఇబ్బంది పెట్టబోమని పరోక్షంగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపుపై కేసీఆర్ ఎంత నమ్మకమో..!?

దుబ్బాక ఉపఎన్నిక విషయంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చాలా క్లారిటీగా ఉన్నారు. ధరణి పోర్టల్ ప్రారంభించిన తర్వాత మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడిన కేసీఆర్.. దుబ్బాకలో గెలుపు ఎప్పుడో డిసైడైపోయిందని తేల్చారు....

సంచైతకు కౌంటర్‌గా ఊర్మిళా గజపతి..!

విజయనగరం రాజుల ఫ్యామిలీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పెట్టిన చిచ్చును.. రాజకీయంగానే ఎదుర్కోవాలని... ఇంక ఏ మాత్రం సహించకూడదని... గజపతుల కుటుంబం నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్‌గా...

రాయలసీమ ఎత్తిపోతలను రిస్క్‌లో పెట్టేసిన ఏపీ సర్కార్..!

ముందూ వెనుకా చూసుకోకుండా.... రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పై దూకుడుగా వెళ్లిన ఏపీ సర్కార్.. ఆ ప్రాజెక్ట్‌ను పూర్తిగా రిస్క్‌లో పడేసింది. టెండర్లు ఖరారు చేసి..మేఘా కన్సార్టియంకు పనులు అప్పగించేసిన తర్వాత ఇప్పుడు......

ఏపీలో మద్యం ధరలు భారీగా తగ్గింపు..! తాగమని ప్రోత్సాహమా..?

ఆంధ్రప్రదేశ్‌లో మందు బాబులతో తాగడం మాన్పించాలని మద్యం రేట్లు షాక్ కొట్టేలా పెంచేసిన ప్రభుత్వానికి తత్వం బోధపడినట్లుగా ఉంది. షాక్ కొట్టేలా రేట్లు పెంచితే...ఆ మద్యాన్ని కొని షాక్ కొట్టించుకోకుండా... పక్క రాష్ట్రాల...

HOT NEWS

[X] Close
[X] Close