ఏపీ ప్రత్యేకహోదాపై తెలంగాణలోనూ రాజకీయమే.. !

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలనే అంశం.. ఆ ఒక్క రాష్ట్రానికే పరిమితం కాలేదు. ఈ అంశం తెలంగాణలోనూ రాజకీయ వేడి రాజేస్తోంది. నిన్నామొన్నటి వరకు.. ఏపీకి ప్రత్యేకహోదాకు మేము కూడా మద్దతిస్తామన్న తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇప్పుడు ఏపీకి ఇస్తే మాకివ్వాల్సిందేనని ప్రకటిస్తోంది. అంతే కాదు.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ.. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకోవడం ప్రారంభించారు. తెలంగాణ నుంచి ఏపీకి పరిశ్రమలను తరలించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని టీఆర్ఎస్ నేతలు.. తీవ్ర ఆరోపణలు ప్రారంభించారు.

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన మొదటి సమావేశంలో… తమకు దూరమైన ఓటర్లందర్నీ దగ్గరకు చేసుకోవాలని మేథోమథనం నడిపారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ అయిన ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చి… ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆంధ్రకు ఇచ్చిన హామీని నెరవేరుస్తామని ప్రకటించారు. దీన్ని టీఆర్ఎస్ నేతలు అంది పుచ్చుకున్నారు. తెలంగాణను కాంగ్రెస్ మోసం చేస్తోందనే వాదనను తెరపైకి తీసుకు వచ్చారు. హరీష్ రావు ఈ విషయంలో మరింత దూకుడుగా ఉన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చి తెలంగాణ పరిశ్రమలన్నీ తరలిపోయేలా కుట్ర చేస్తున్నారంటూ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. బీజేపీపై కూడా హరీష్ రావు విమర్శలు చేసినప్పటికీ… కాంగ్రెస్‌నే ప్రధానంగా టార్గెట్ చేసుకున్నారు.

ఏపీ ప్రత్యేకహోదాను అడ్డు పెట్టుకుని టీఆర్ఎస్ నేతలు రాజకీయం ప్రారంభించడంతో.. కాంగ్రెస్ నేతలకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఎన్నికల అస్త్రంగా మార్చుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అటు పార్లమెంట్ లో గాని, ఇటు సీ డబ్ల్యూసీ లో గాని తెలంగాణ గురించి మాట్లాడకపోవడాన్ని గులాబీ పార్టీ ఎత్తి చూపుతోంది. అసలే పార్టీలేని చోట ప్రయోజనం కోసం పార్టీ చేస్తోన్న ప్రకటన తెలంగాణలో పార్టీకి ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేతలు ఫీలవుతున్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రేస్ పార్టీ అనే విషయాన్ని బలంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు..

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల నాటికి.. ప్రత్యేకహోదా అంశమే ప్రధాన ఎజెండా కానుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ సన్నాహాలు చేసుకుంటోంది. అందులో భాగంగానే ప్రస్తుత పరిణామాలు జరుగుతున్నాయన్న అంచనాలు కూడా ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close