వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తుందని హరీష్ రావు ప్రకటించారు. ఏ పార్టీతో పొత్తు ఉండదని… ఇక విలీనం అన్న ప్రశ్నే రాదని హరీష్ రావు చెబుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా వంద సీట్లు వస్తాయని చెప్పుకొచ్చారు. బనకచర్ల నుంచి పోలీసు అధికారుల వరకూ చాలా మాట్లాడినా.. హరీష్ రావు .. మత పార్టీ తరపున ఇలాంటి విధానపరమైన ప్రకటన చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే హరీష్ రావుకు ఈ పవర్ కేసీఆర్ ఇచ్చారా లేకపోతే ఆయనే అడ్వాంటేజ్ తీసుకున్నారా అన్నది చాలా మందికి వస్తున్న డౌట్.
బీఆర్ఎస్ లో ఇప్పుడు హరీష్ రావు విధానపరమైన నిర్ణయాలు తీసుకునే స్థాయిలో లేరు. ఇంకా చెప్పాలంటే అలాంటి విధానపరమైన సమావేశాలకూ ఆయకు ఆహ్వా నం రావడం లేదు. ుగతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో అయినా ఆయన చెల్లుబాటు అయ్యేది. ఇప్పుడు అందలో సగం ప్రాంతంలోనూ ఆయనకు పలుకుబడి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బీఆర్ఎస్ పొత్తులు, విలీనాలను ఖండించి.. ఒంటరిపోటీ అని ప్రకటించడం కాస్త వింతగానే ఉంటుంది.
ఒంటరి పోటీనే అని ప్రకటించాల్సింది కేసీఆర్ లేకపోతే కేటీఆర్. ఒకరు ప్రెసిడెంట్.. మరొకరు వర్కింగ్ ప్రెసిడెంట్ . వీరు చెబితే కాస్త విలువ ఉంటుంది కానీ హరీష్ రావు అడ్వాంటేజ్ తీసుకుని ఈ ప్రకటన చేశారు. కవిత లేఖలో బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో హరీష్ రావు మరింతగా డ్యామేజ్ జరగకుడా ఈ ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు. కానీ ఈ ప్రకటనలకు అంత సీరియస్ నెస్ లేదని భావిస్తున్నారు.