హర్యానా ముస్లీం పూర్వీకులు యధువంశీయులా !?

హర్యానాలోని కొంతమంది ముస్లీం మతస్థులు తమ పూర్వీకులు ఆలమందలు (ఆవుల మందలను) కాచేవారని చెప్పుకుంటున్నారు. తమ పూర్వీకులు ఆ విధంగా యధువంశీయులన్నది వీరి భావన. మనదేశంలో ఇస్లాం మతపు ఛాయలు పడిన తర్వాత, కాలక్రమంగా తమ పూర్వీకులు మతం మార్చుకున్నట్లు హర్యానాలోని కొంత మంది ముస్లీంలు అంగీకరిస్తున్నారు. ఈ భావన హర్యానాలో గో సంరక్షణకు సానుకూలమైంది.

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తార్ తో ఆ రాష్ట్ర ముస్లీంలు తమ పూర్వీకులు అప్పట్లో గోవులను కాచేవారనీ, తర్వాత తరాల్లో తాము ముస్లీం మతస్థులమయ్యామని చెప్పుకున్నారు. ఈ ఏడాది మార్చిలో హర్యానాలో గో సంరక్షణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు ముస్లీం శాసనసభ్యులు సైతం ఈ బిల్లుకు మద్దతు పలికారు. పైగా తమ పూర్వీకులు యధువంశీయులని వారు చెప్పినట్లు హర్యానా సీఎం గుర్తుచేసుకున్నారు.
గో సంరక్షణ పట్ల హర్యానా ముస్లీంలు చాలా ఆసక్తి చూపుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి అక్కడ ముస్లీంలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సైతం గో సంరక్షణ శాలలు కట్టించేందుకు సిద్ధమవుతున్నారు.

గో సంరక్షణ చట్టం

కాగా, హర్యానాలో గురువారం (19-11-15) నుంచి గో సంరక్షణకు సంబంధించిన చట్టం అమల్లోకి వచ్చింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించడంతో చట్టం అమల్లోకి వచ్చినట్లయింది. హర్యానాలో గో సంరక్షణ బిల్లుని శాసన సభలో ప్రవేశపెట్టినప్పుడు ముగ్గురు ముస్లీం శాసనసభ్యులు కూడా మద్దతు ఇవ్వడం గమనార్హం.

హర్యానాలో గో సంరక్షణ చట్టం అమలుకావడంతో గోవులను వధించేవారికి కఠిన శిక్షలు విధించేందుకు వీలుచిక్కింది. ఈ నేరాలకు పాల్పడినవారికి మూడు నుంచి పదేళ్లదాకా జైలుశిక్షలు పడవచ్చు. గోవంశ్ సంర్షణ్, గో సంవర్థన్ బిల్లుకు అక్కడి సీఎం చట్టబద్ధత తీసుకొచ్చారు. గోపాష్టమి సందర్బంగా హర్యానా ముఖ్యమంత్రి ఈ కొత్త చట్టం నోటిఫికేషన్ ప్రతులను లాంఛనంగా విడుదలచేశారు. ఈ సందర్బంగానే ఆయన కొంతమంది ముస్లీంలు తమ పూర్వీకుల సంగతి చెప్పిన విషయాలను ప్రస్తావించారు.

హర్యానా అసెంబ్లీలో 90మంది సభ్యులుండగా, ఈ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం లభించడం విశేషం. అన్యమతస్థులైన ముస్లీం సభ్యులుకూడా గో సంరక్షణకు మద్దతునిచ్చారు. దీనికి ప్రధానకారణం, తమ పూర్వీకుల అభిప్రాయాలను గౌరవించడమే.

హర్యానాలోని ముస్లీంల్లో ఒక అభిప్రాయం ప్రగాఢంగానే ఉంది. తమ పూర్వీకులు ఆలమందలను కాచేవారని అంటారు. అంటే వీళ్లు కూడా యధువంశీయులేనన్న అభిప్రాయం ఉంది. అందకే వీరు గో సంరక్షణ బిల్లుకు మద్దతు పలకడమేకాకుండా గోశాలలను కూడా వాళ్లు ఏర్పాటుచేసుకుంటున్నారు.

హర్యానా సీఎం మరో ప్రతిపాదనను కూడా తీసుకొచ్చారు. పట్టణాల్లో ఉంటున్నవారు ఆవులను పెంచడానికి స్థలం లేకపోతే గ్రామాల్లో ఉండే తమబంధువులకు డబ్బు ఇచ్చి ఆ పని చేయించవచ్చని అంటున్నారు. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం, ఆవులను అక్రమంగా తరలించడం, వధించడం, గో మాంసం తినడం హర్యానాలో నిషేధం.

గో సంపద పెంచడానికీ, వాటిని సంరక్షించడానికి నోటి మాటలు సరిపోవు. అందుకోసం ప్రభుత్వం అనేక పథకాలను చేపట్టాలి. హర్యనా ఈ విషయంలో ముందంజవేసింది. ఈ పథకాల ప్రకారం, ఐదు ఆవులతో మినీ డయిరీ ఏర్పాటుచేసుకుంటే 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. దీనితోపాటు పదివేల నుంచి 20వేల వరకు పారితోషికం అందజేస్తారు. ఇది ఇలా ఉంటే, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి మరోమెట్టు పైకెక్కి సంచలన వ్యాఖ్యలు చేశారు.

గోవధచేసేవారు దేశం వదిలిపోండి

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ తాజా వ్యాఖ్యలతో గోవధ అంశం మరోసారి సంచలనం సృష్టిస్తోంది. గోవులను వధించితీరుతామనేవారు దేశానికి అతిపెద్ద శత్రువులుగా ఆయన అభివర్ణించారు. అలాంటివాళ్లు ఈ దేశంలో ఉండే హక్కును కోల్పోతారని తేల్చిచెప్పారు.

`ఆవులను వధించేది ఎవరైనా కావచ్చు, వారు ఏ మతానికి చెందినవారన్నది అప్రస్తుతం, అలాంటివారంతా దేశానికి శత్రువులే, వారికి ఈదేశంలో నివసించే హక్కులేదు ‘ అంటూ ఉత్తరాఖండ్ సీఎం రూల్ పాస్ చేశారు. గోపాష్టమి సందర్భంగా ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవులను వధించేవారి పట్ల చట్టం కఠినంగా వ్యవహరిస్తుందనీ, గోసంరక్షణ కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటున్నదని హామీఇచ్చారు. కాగా, దేశంలో ఈ ఒక్క రాష్ట్రంలోనే గోశాలల నిర్మాణానికి స్థలాలు కేటాయించడం, గోవుల కోసం గ్రాసం ఇవ్వడం గమనార్హం.

చట్టాలు ఉండగానే సరిపోదు, వాటి అమలుతీరును జాగ్రత్తగా చూస్తుండాలి. అలాగే, గోవులు మన ఆర్థిక సంపదలో భావమన్న విషయం అన్ని మతాలవారికి అర్థమయ్యేలా చెప్పాలి. మతసామరస్యంతోనే గోవధను పూర్తిగా నిషేధించాలి. వృద్ధులకు శరణాలయాలున్నట్లుగానే వయసుమళ్లిన ఆవులను చివరివరకు కాపాడటానికి ప్రత్యేకంగా గోశాలలుండాలి. అవి చనిపోయినప్పుడు దహనసంస్కారాలు జరిగేలా చూడాలి. దేశంలోని మెజారిటీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రతి రాష్ట్రం ముందుకు కదలాలి. యుగయుగాలుగా మనదేశపు ఆర్థిక సంపదైన ఆవులను రక్షించుకోవాలి. హర్యానా, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకుని చట్టం అమల్లోలేని చోట్ల వెంటనే సంబంధిత బిల్లులను ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలి.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ దళిత రైతు ఆత్మహత్య ప్రభుత్వ హత్యే..!

నెల్లూరు జిల్లాలో ఓ దళిత రైతు.. తన భూమిని బలవంతంగా లాక్కుంటున్నారన్న ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్నాయి. అయితే.....

‘ల‌వ్ స్టోరీ’ ప్లానింగు ఇదీ….

సాధార‌ణంగా శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలు తీసే తీరు పాసింజ‌ర్ రైలుని త‌ల‌పిస్తుంటాయి. ఆగి... ఆగి.. కొంచెం.. కొంచెం.. త‌న మూడ్ ని బ‌ట్టి, షూటింగ్ చేస్తుంటాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. దానికి త‌గ్గ‌ట్టుగా లాక్...

ఆర్‌.ఎఫ్‌.సీలో సెటిలైపోతున్న రౌడీ

పూరి జ‌గ‌న్నాథ్ - విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్టు ఇది. క‌థ ప్ర‌కారం సినిమా మొత్తం ముంబైలోనే...

‘ఓ పిట్ట క‌థ’ లాభాల వెనుక పెద్ద క‌థ‌

లాక్ డౌన్‌కి ముందు, థియేట‌ర్లు మూసివేయ‌డానికి ఓ వారం ముందు విడుద‌లైన సినిమా 'పిట్ట‌క‌థ‌'. మంచి ప‌బ్లిసిటీతో విడుద‌లైన ఈ చిన్న సినిమా.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఏ ర‌క‌మైన ప్ర‌భావాన్నీ చూపించ‌లేక‌పోయింది. క‌రోనా...

HOT NEWS

[X] Close
[X] Close