“పోలీస్‌స్టేషన్‌పై దాడి కేసులు ఎత్తివేత” జీవో నిలుపుదల..!

తెలుగుదేశం పార్టీ హయాంలో పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌పై కొంత మంది దాడి చేసి బీభత్సం సృష్టించారు. పోలీసులపై దాడి చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. ఆ కేసులను ప్రస్తుత ప్రభుత్వం ఎత్తివేస్తూ జీవో జారీ చేసింది. కేసుల్ని ఎత్తివేసింది. ఈ కేసులపై ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకుంటూ ఫిబ్రవరి 17న ప్రభుత్వానికి డీజీపీ లేఖ రాశారు. లేఖని ఆమోదిస్తూ ఆగస్ట్‌ 12న 776 జీవో విడుదల చేసింది. ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకోవాలని స్టేషన్‌హౌస్ ఆఫీసర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఆదేశాలు జారీ చేశారు.లీసు స్టేషన్‌పై దాడి చేసిన కేసులు కూడా ఎత్తివేస్తే ఇక.. ఏ నేరాలు చేసినా భయం ఉండదనే భావన నేరస్తుల్లో ఏర్పడుతుందనే విమర్శలు అప్పుడే వచ్చాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.

ఈ జీవోను సవాల్ చేస్తూ.. ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన కేసులే ఎత్తేస్తే.. ఇలాంటి నేరాలు భవిష్యత్‌లో పునరావృతం అయ్యేందుకు ఈ జీవో ప్రోత్సాహాం ఇస్తుంనిద.. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరపాలని హైకోర్టుకు పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. జీవోను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం.. అందులో నిందితుల్ని ముస్లిం యువతగా పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషన్‌లో ఎన్ఐఎని కూడా పార్టీగా చేర్చాలని ధర్మాసనం సూచిస్తూ.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీవో నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఓ చిన్నారిపై జరిగిన అత్యాచారం ఘటన విషయంలో.. పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసినప్పటికీ.. రాత్రికి రాత్రి కొంత మంది గుంపు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. ఆ ఘటన ఓ ప్రణాళిక ప్రకారం జరిగిందని అప్పట్లో పోలీసులు నిర్ధారించారు. అందులో పాల్గొన్న వారిపై కేసులు పెట్టారు. సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. కొత్త ప్రభుత్వం ఆ కేసుల్ని ఉపసంహరించుకుటూ నిర్ణయం తీసుకుంది. తమపై దాడి చేసిన కొట్టారని తెలిసినా పోలీసు బాస్ గౌతం సవాంగ్ ఆ కేసును ఉపసంహరిస్తూ.. నిర్ణయం తీసుకోవడం అప్పట్లోనే చర్చనీయాంశం అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపుపై కేసీఆర్ ఎంత నమ్మకమో..!?

దుబ్బాక ఉపఎన్నిక విషయంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చాలా క్లారిటీగా ఉన్నారు. ధరణి పోర్టల్ ప్రారంభించిన తర్వాత మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడిన కేసీఆర్.. దుబ్బాకలో గెలుపు ఎప్పుడో డిసైడైపోయిందని తేల్చారు....

సంచైతకు కౌంటర్‌గా ఊర్మిళా గజపతి..!

విజయనగరం రాజుల ఫ్యామిలీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పెట్టిన చిచ్చును.. రాజకీయంగానే ఎదుర్కోవాలని... ఇంక ఏ మాత్రం సహించకూడదని... గజపతుల కుటుంబం నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్‌గా...

రాయలసీమ ఎత్తిపోతలను రిస్క్‌లో పెట్టేసిన ఏపీ సర్కార్..!

ముందూ వెనుకా చూసుకోకుండా.... రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పై దూకుడుగా వెళ్లిన ఏపీ సర్కార్.. ఆ ప్రాజెక్ట్‌ను పూర్తిగా రిస్క్‌లో పడేసింది. టెండర్లు ఖరారు చేసి..మేఘా కన్సార్టియంకు పనులు అప్పగించేసిన తర్వాత ఇప్పుడు......

ఏపీలో మద్యం ధరలు భారీగా తగ్గింపు..! తాగమని ప్రోత్సాహమా..?

ఆంధ్రప్రదేశ్‌లో మందు బాబులతో తాగడం మాన్పించాలని మద్యం రేట్లు షాక్ కొట్టేలా పెంచేసిన ప్రభుత్వానికి తత్వం బోధపడినట్లుగా ఉంది. షాక్ కొట్టేలా రేట్లు పెంచితే...ఆ మద్యాన్ని కొని షాక్ కొట్టించుకోకుండా... పక్క రాష్ట్రాల...

HOT NEWS

[X] Close
[X] Close