ఉత్తరాఖండ్ రాజకీయాలలో మళ్ళీ కొత్త ట్విస్ట్!

ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్ ప్రభుత్వంలోకి తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినప్పటి నుంచి, రాష్ట్ర రాజకీయాలు రోజుకొక ఊహించని మలుపు తిరుగుతున్నాయి. ఈనెల 28న ముఖ్యమంత్రి హరీష్ రావత్ ని శాసనసభలో బలనిరూపణ చేసుకోమని గవర్నర్ ఆదేశించారు. కానీ దానికి కొన్ని గంటల ముందే హరీష్ రావత్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందనే కుంటిసాకుతో కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదించింది. దానిని ఆయన హైకోర్టులో సవాలు చేయగా జస్టిస్ యు.సి. దయానీ, రాష్ట్రపతి పాలనపై స్టే మంజూరు చేయడమే కాకుండా, రేపు అంటే 31వ తేదీన హరీష్ రావత్ కి శాసనసభలో బలనిరూపణ చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించారు. హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును కేంద్రప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాలు చేయగా, చీఫ్ జస్టిస్ కె.ఎం. జోసఫ్ మరియు జస్టిస్ వి.కె. భిస్త్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ పక్కనపెట్టి, ఈ కేసుపై తదుపరి విచారణను ఏప్రిల్ 6వ తేదీకి వాయిదా వేసింది. అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మళ్ళీ రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చిందన్న మాట. కనుక రేపు శాసనసభలో హరీష్ రావత్ బలపరీక్ష కూడా ఉండబోదన్నమాట. హైకోర్టు మళ్ళీ దీనిపై విచారణ చేపట్టి తీర్పు చెప్పేవరకు హరీష్ రావత్ ఎదురుచూస్తారో లేకపోతే ఈలోగానే హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీ తల్చుకుంటే శ్రీవారి ఆస్తుల అమ్మకం నిలిపివేత ఎంత సేపు..!?

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు..శ్రీవారి ఆస్తులను అమ్మకానికి పెట్టిన విషయంపై బీజేపీ భగ్గమని లేస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు దీక్షలకు సిద్ధమయ్యారు..తెలంగాణ నేతలు కూడా.. ఊరుకునేది లేదని.. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్వయంగా......

ఏడాదిలో 90 శాతం హామీలు అమలు చేశాం : జగన్

మద్యం రేట్లను పెంచడం ద్వారా మద్యం తాగే వారి సంఖ్య 24 శాతం మేర తగ్గిపోయిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తేల్చారు. పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా.. మన పాలన- మీ...

స్టూడియోల‌కు పూర్వ వైభ‌వం

జీవితం ఓ సైకిల్ చ‌క్రం లాంటిది. ఎక్క‌డ మొద‌లెట్టామో తిరిగి అక్క‌డికే వ‌చ్చి ఆగుతాం. సినిమాల ప‌రిస్థితి ఇప్పుడు అలానే మారింది. ఇది వ‌ర‌కూ సినిమా అంటే స్టూడియో వ్య‌వ‌హార‌మే. తొలి స‌న్నివేశం...

విమానాల వాయిదా : తొందరపడినా ప్రభుత్వం సిద్ధం కాలేకపోయిందా..?

దేశమంతా విమనాశ్రయాలు ఓపెన్ అయ్యాయి.. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం.. ఒక్క రోజు వాయిదా పడ్డాయి. కారణాలేమైనా కావొచ్చు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... లాక్ డౌన్ ఎత్తేసి.. సాధారణ కార్యకలాపాలు ప్రారంభించాలని.. లాక్‌డౌన్ 1.0 అయిపోయినప్పుడే...

HOT NEWS

[X] Close
[X] Close