మ‌హేష్ అడిగినా కాద‌న్నాడు

మ‌హేష్‌బాబు…. టాలీవుడ్ సూప‌ర్ స్టార్‌. ఆయ‌న సినిమాకి ప‌నిచేయాల‌ని ప్ర‌తి ఒక్క‌రికీఉంటుంది. క‌థానాయిక‌లు, ద‌ర్శ‌కులు.. మహేష్ కోసం క్యూ క‌డ‌తారు. సాంకేతిక నిపుణులు కూడా అంతే. అలాంటిది…మ‌హేష్ నోరు తెరిచి ‘నా సినిమాకి ప‌నిచేస్తారా’ అని అడిగినా ‘నో’ అనేవాళ్లు ఉంటారా?? కానీ.. ఉన్నారు. ఆయ‌నే సంతోష్ శివ‌న్‌. దేశం గ‌ర్వించ‌ద‌గిన కెమెరామెన్‌ల‌లో ఆయ‌న పేరు త‌ప్ప‌కుండా ఉంటుంది. సంతోష్ తో ప‌నిచేయాల‌ని మ‌హేష్ ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నాడ‌ట‌. కొన్ని సినిమాల కోసం మహేష్ స్వ‌యంగా సంతోష్ శివ‌న్‌కు ఫోన్ చేసి ‘మా సినిమాకి మీ సేవ‌లు కావాలి’ అని నోరు తెర‌చి అడిగాడ‌ట‌. కానీ సంతోష్ శివ‌న్ మాత్రం మొహ‌మాటం లేకుండా ‘నో’ చెప్పేసేవాడ‌ట‌ అయితే స్పైడ‌ర్ కోసం మాత్రం సంతోష్ శివ‌నే స్వ‌యంగా ఫోన్ చేసి ”ఈ సినిమాకి నేను ప‌నిచేస్తున్నా” అని మాట ఇచ్చాడ‌ట‌.

అందుకు కార‌ణ‌మేంటో కూడా మ‌హేష్ చెప్పేశాడు. తెలుగు ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయ‌డం సంతోష్‌కి ఇష్టంఉండ‌ద‌ట‌. ఇక్క‌డి దర్శ‌కుల సెన్సిబులిటీస్ త‌న‌కుఅర్థం కావ‌ని, అందుకే తెలుగు సినిమాలు చేయన‌ని మ‌హేష్ అభ్య‌ర్థ‌న‌ని సున్నితంగా తోసి పుచ్చేవాడ‌ట‌. స్పైడ‌ర్ మురుగ‌దాస్ సినిమా. ఆయ‌న త‌మిళ‌ద‌ర్శ‌కుడు. అందుకే ఈసినిమా చేయ‌డానికి ఒప్పుకొన్నాడ‌ట‌. స్పైడ‌ర్ టీమ్‌లో మ‌హేష్ ఫేవ‌రెట్‌ కెమెరామెన్ ఉండ‌డానికి కార‌ణం మ‌హేష్ కాదు…అక్ష‌రాలా మురుగ‌దాస్‌. ఈ సినిమాకి మ‌రో ద‌ర్శ‌కుడితో చేసుంటే…సంతోష్ ‘నో’ చెప్పేసేవాడే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close