హైదరాబాద్ లో భారీ వర్షం..కొట్టుకుపోతున్న వాహనాలు!

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం మంగళవారం తెల్లవారుజుమున మరింత జోరందుకుంది. దిల్ సుఖ్ నగర్ , కొత్తపేట , సరూర్ నగర్ , ఎల్బీనగర్ , నాగోల్ , అల్కాపురి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.

ఖైరతాబాద్ , నాంపల్లి , బషీర్ బాగ్ , హిమాయత్ నగర్ , అబిడ్స్ , నాంపల్లి , కుత్బుల్లాపూర్ , బాలానగర్ , గాజులరామారం , జగద్జిరిగుట్ట్ట, బహదూర్ పల్లి , సూరారం , సుచిత్ర, జీడిమెట్లలో కుండపోత వర్షం కురుస్తోంది. వనస్థలిపురం , బీఎన్ రెడ్డి నగర్ , హయత్ నగర్, పెద్ద అంబర్ పేట్ , అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో రహదారులన్నీ నీటితో నిండిపోయాయి.

ఇప్పటికే సోమవారం భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు, కాలనీలు జలదిగ్బంధం అయ్యాయి. పరిస్థితి కొంత కుదుటపడుతుండగానే తెల్లవారుజామున కురిసిన వర్షంతో కాలనీలు, రోడ్లు జలమయం అయ్యాయి. భారీ వర్షం ధాటికి నాళాలు ఉప్పొంగి ప్రవహించడంతో వాహనాలు కూడా కొట్టుకుపోయాయి.

కొన్ని ప్రాంతాల్లో మోకాలిలోతు వరకు నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మంగళవారం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని .. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. మరోవైపు హైదరాబాద్ కు ఎల్లో ఎలర్ట్ జారీ చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

100రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ అవుతోందా.. మంత్రులు, ఎమ్మెల్యేల్లో హైరానా

ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేల వందరోజుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదివరకు ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడి మరికొద్ది రోజుల్లోనే వంద రోజులు కానున్న నేపథ్యంలో మంత్రులు,...

రివ్యూ: జీతూ జోసెఫ్ క్రైమ్ కామెడీ నవ్వించిందా?

సీరియస్ క్రైమ్ థ్రిల్లర్స్ తీసే దర్శకుడు జీతూ జోసెఫ్. ఆయన సినిమాలకి ఒక కల్ట్ ఫాలోయింగ్ వుంది. దృశ్యం సినిమాని ప్ర‌పంచ వ్యాప్తంగా ఆదరించారు. ఇప్పుడాయన నుంచి ఓ క్రైమ్ కామెడీ వచ్చింది....

కోడి రామ్మూర్తి నాయుడుగా రామ్‌చ‌ర‌ణ్‌?

రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు ఈ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని ప‌ట్టాలెక్కిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తిక‌ర‌మైన విష‌యం ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది....

బాచుపల్లిలో ఇప్పటికీ అందుబాటు ధరల్లోనే ఇళ్లు !

బాచుపల్లి అంటే అమ్మో కాస్ట్ లీనా అనుకునే పరిస్థితి వచ్చింది. నిజానికి ఒకప్పుడు అబ్బో బాచుపల్లినా అంత దూరం ఎవరు వస్తారు అనుకునేవారు. ఒకప్పుడు అంటే.. ఎంతో కాలంకిందట కాదు.. జస్ట్ పదేళ్ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close