ఇస్మార్ట్ శంక‌ర్ కాన్సెప్ట్ నాదే అంటున్న హీరో

ఆకాష్‌… ఈ హీరో పేరు జ‌నం మ‌ర్చిపోయి ఉంటారు. `ఆనందం` ఆకాష్ అంటే గుర్తుకు రావ‌చ్చు. శ్రీ‌నువైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ‘ఆనందం’తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆకాష్‌. అదే త‌న తొలి, చివ‌రి హిట్లు. ఆ త‌ర‌వాత ద‌ర్శ‌కుడిగా మారి కొన్ని సినిమాలు చేశాడు. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. త‌మిళంలో చిన్న బ‌డ్జెట్ సినిమాలు తీసుకుంటూ, దాన్ని తెలుగులో డ‌బ్ చేసుకుంటూ కాల‌క్షేపం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆకాష్ మ‌న మీడియా ముందుకొచ్చాడు. `ఇస్మార్ట్ శంక‌ర్` కాన్సెప్ట్ త‌న‌దే అంటూ.. బాంబు పేల్చాడు.

ఒక వ్యక్తి మెదడును హీరోకి మార్పిడి చేయడమనే మూల కథతో ‘ఇస్మార్ట్ శంకర్’ రూపొందింది. ఇదే ఇతివృత్తంతో తెలుగు-తమిళ భాషల్లో ‘నాన్ యార్‌’ అనే సినిమా రూపొందింద‌ని, ఆ సినిమాకి క‌థ‌, క‌థ‌నం కూడా తానే అందించాన‌ని, ఇప్పుడు ఇదే కాన్సెప్టు తో పూరి ‘ఇస్మార్ట్‌ శంక‌ర్’ సినిమా తీశాడ‌ని ఆరోపిస్తున్నారు ఆకాష్‌. `నాన్ యార్‌` అనే సినిమాని తెలుగులో డ‌బ్ చేద్దామ‌ని ఆకాష్ భావించాడ‌ట‌. తీరా చూస్తే… అదే కాన్సెప్ట్ తో ఇస్మార్ట్ శంక‌ర్ రిలీజ్ అయిపోయిందని ఈ విషయమై పూరి జగన్నాధ్ ను సంప్రదించాలని ప్రయత్నించామని.. కానీ ఆయన అందుబాటులోకి రాకపోవడం వలన.. తమిళ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేసి.. సత్వర పరిష్కారం కోసం ఇక్కడ మీడియాను ఆశ్రయించామని ఆకాష్ తెలిపారు. సమస్య సామరస్యంగా పరిష్కారం కానీ పక్షంలో లీగల్ గా ప్రొసీడ్ అవుతాన‌ని హెచ్చ‌రిస్తున్నాడు.

ఇలాంటి ఆరోప‌ణ‌లేం వాస్త‌వంలో నిల‌బ‌డ‌లేదు. కేవ‌లం త‌న సినిమా `నాన్ యార్‌`కి ప్ర‌మోష‌న్ ఇప్పించుకోవడానికి త‌ప్ప ఆకాష్ కీ ఇందులో పైసా ఒరిగేది ఉండ‌దు. నిజానికి `ఇస్మార్ట్ శంక‌ర్` ఓ హాలీవుడ్ సినిమాకి ప్రేర‌ణ‌. ఆ విష‌యాన్ని పూరి కూడా అంగీక‌రించాడు. ఇప్పుడు ఆకాష్ కొత్తగా ఉద్ధ‌రించేదేముంది..??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com