కీర్తి సురేష్‌కి ఫ్లాట్ కొనిచ్చిన హీరో ఎవ‌రు?

కీర్తి సురేష్ చెన్నైలో ఓ ఖ‌రీదైన ఫ్లాట్ కొనుక్కుంది. కీర్తి సాధిస్తున్న విజ‌యాలు, వ‌స్తున్న ఆఫ‌ర్లు, అందుకుంటున్న పారితోషికాలు లెక్క‌గ‌డితే.. కీర్తి ఫ్లాట్ కొన‌డం పెద్ద విచిత్రంగా ఏమీ అనిపించ‌దు. కాక‌పోతే… ఈ ఫ్లాట్ త‌న‌కు బ‌హుమానంగా వ‌చ్చింద‌ని చెన్నై వ‌ర్గాలు కోడై కూస్తున్నాయి. ఓ అగ్ర క‌థానాయ‌కుడు కీర్తికి ఫ్లాట్ ని బహూక‌రించాడని టాక్‌. ఆ క‌థానాయ‌కుడిగా త‌మిళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్ద‌రూ క‌ల‌సి ఓ సినిమా కూడా చేశారు. ఆ ప్రేమ‌తోనే కీర్తికి ఈ ఫ్లాట్ కొనిచ్చాడ‌న్న వార్త‌లు గుప్పుమంటున్నాయి. గ‌తంలో స‌ద‌రు క‌థానాయ‌కుడు మ‌రో ‘తార‌’కీ ఇలానే ఫ్లాట్ కొనిచ్చాడ‌ట‌. అప్ప‌ట్లో ఆ వార్త కూడా ఇలానే చ‌క్క‌ర్లు కొట్టింది. హైద‌రాబాద్‌లో రాశీఖ‌న్నా ఓ ఫ్లాట్ కొనుక్కుంది. ర‌కుల్ కూడా అంతే. వీరిద్ద‌రూ సొంత ఇల్లు కొనుక్కున్న‌ప్పుడు కూడా ఇలాంటి రూమ‌ర్లే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ‘అది నా క‌ష్టార్జితం. ఈ ఫ్లాటు కొనుక్కోవ‌డంలో ఎవ‌రి ప్ర‌మేయం లేదు’ అని స్వ‌యానా ఆ క‌థానాయిక‌లు గోడు వెళ్ల‌గ‌క్కుకోవ‌డంతో పుకార్లు త‌గ్గాయి. మ‌రి కీర్తి సురేష్ కూడా అదే పాట పాడుతుందా? లేదంటే ఎందుకొచ్చిన గొడ‌వ అనుకుని కామ్‌గా ఉంటుందా?? వెయిట్ అండ్ సీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close