హీరో నిఖిల్ పెళ్లి

లాక్ డౌన్‌… ఆశ‌ల‌కూ, క‌ల‌ల‌కూ కూడా `లాక్‌` వేసేసింది. శుభ‌కార్యాల‌న్నీ ఆగిపోయాయి. పెళ్లి ముహుర్తాలు కూడా వెన‌క్కి వెళ్లిపోయాయి. నితిన్‌, నిఖిల్ లాంటి సెల‌బ్రెటీల పెళ్లిళ్లు ఈ లాక్ డౌన్ లోనే జ‌ర‌గాల్సివుంది. కానీ వాయిదా వేసుకున్నారు. `పెళ్లి కంటే.. ప్రాణాలే ముఖ్యం..` అంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చారు. అయితే ఇప్పుడు నిఖిల్ పెళ్లికి తొంద‌ర ప‌డుతున్నాడు. లాక్ డౌన్ ఎంత‌కీ ఎత్తేయ‌క‌పోవ‌డంతో పెళ్లికి రెడీ అయ్యాడు.

డాక్ట‌ర్ ప‌ల్ల‌విని ప్రేమించి పెళ్లి చేసుకోవాల‌ని నిఖిల్ నిర్ణ‌యించుకున్న సంగ‌తి తెలిసిందే. వీళ్ల పెళ్లి ఎప్పుడో జ‌ర‌గాల్సింది. కానీ లాక్ డౌన్ వ‌ల్ల వాయిదా ప‌డింది. పెళ్లిళ్ల‌కు 20 మందికంటే ఎక్కువ మంది అతిథుల‌కు అనుమ‌తులు ఇవ్వ‌క‌పోవ‌డంతో నిఖిల్ పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. `నిడారంబ‌రంగా చేసుకోవ‌డ‌డం అస్స‌లు ఇష్టం లేదు. క‌రోనా గొడ‌వ త‌గ్గాక వైభ‌వంగా పెళ్లి చేసుకుంటా` అన్నాడు. అయితే.. ఈ లాక్ డౌన్ ఇలా పొడిగించుకుంటూ పోవ‌డంతో పెళ్లి చేసుకోవ‌డం త‌ప్ప‌డం లేదు. గురువారం హైద‌రాబాద్ శివార్ల‌లోని ఓ ఫామ్ హౌస్‌లో నిఖిల్ పెళ్లి జ‌ర‌గ‌బోతోంది. ఈ పెళ్లికి కేవ‌లం నిఖిల్‌, ప‌ల్ల‌విల కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే హాజ‌ర‌వుతార‌ని తెలుస్తోంది. లాక్ డౌన్ ఎత్తేశాక‌… గ్రాండ్ గా రిసెప్ష‌న్ ఇవ్వాల‌ని భావిస్తున్నాడు. ద‌గ్గ‌ర్లో మంచి ముహూర్తాలు లేక‌పోవ‌డంతో లాక్ డౌన్ లోనే పెళ్లి చేసుకుంటున్నాడ‌ని నిఖిల్ స‌న్నిహితులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close