అల్లు అర్జున్, అట్లీ కాంబోలో ఓ సినిమా ఫిక్సయిన సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ కూడా ప్రారంభించారు. ఇదో డిఫరెంట్ జోనర్. విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్ద పీట వేస్తున్న సినిమా. గ్లామర్ పరంగానూ లోటేం లేకుండా చూసుకొంటున్నాడు అట్లీ. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉండబోతున్నారన్న వార్త ముందే లీక్ అయ్యింది. మృణాల్ ఠాకూర్, అనన్యపాండేలను కథానాయికలుగా ఎంచుకొన్నారని తెలుస్తోంది. మరో కథానాయికగా దీపికా పదుకొణె ఫిక్సయినట్టు సమాచారం అందుతోంది. దీపిక కనుక టీమ్ లో ఉంటే.. తన ప్రధాన కథానాయిక. మిగిలిన ఇద్దరూ ఆమె పక్కన సైడ్ హీరోయిన్స్ తో సమానం. మొత్తానికి ఈ ముగ్గురూ సినిమాకు గ్లామర్ పరంగా మైలేజీ తీసుకురావడం ఖాయం.
అయితే దీపికా పదుకొణేతో అట్లీ వేగగలడా? అనేది పెద్ద అనుమానం. దీపికా కండీషన్లు చాలా హెవీగా ఉంటాయి. ఆ కారణంతోనే ‘స్పిరిట్’ నుంచి దీపికాను తప్పిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ‘స్పిరిట్’ కి పెట్టిన రూల్సే… ఇప్పుడు బన్నీ సినిమాకీ పెట్టడం ఖాయం. సందీప్ రెడ్డి రాజీ పడకపోవడంతో పేచీ మొదలైంది. అట్లీ సర్దుకుపోవడానికి సిద్ధంగా ఉంటే… ఈ ప్రాజెక్ట్ లో దీపికా ఎంటర్ అవ్వడం చాలా ఈజీ.
ఇందులో బన్నీ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని తెలుస్తోంది. ఒక పాత్ర పూర్తిగా నెగిటీవ్ లక్షణాలతో ఉంటుందట. హీరో, విలన్ రెండూ బన్నీనే అనే టాక్ కూడా వినిపిస్తోంది. రెండు పాత్రలే అయినా బన్నీ చాలా గెటప్పుల్లో కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. అట్లీకి కాస్త గెటప్పులపై ఆసక్తి ఉంది. ‘జవాన్’లో షారుక్‌ని సైతం మూడు నాలుగు గెటప్పుల్లో చూపించాడు. ఇప్పుడు బన్నీతోనూ అలాంటి ప్రయోగమే చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్ని అట్లీ చాలా పకడ్బందీగా పూర్తి చేశాడు. త్వరలోనే మిగిలిన వివరాలు బయటకు రానున్నాయి.