తెలుగు, తమిళ్, మలయాళం, మరాఠి, భోజ్‌పురి, హిందీ….భాషతో సంబంధం లేదు. మార్కెట్ లెక్కలతో కూడా పని లేదు. భారతీయ సినీ పరిశ్రమ మొత్తం కూడా ఓ విషయంలో మాత్రం అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఎవ్వరూ ప్రశ్నించలేరు. కాదనలేరు. ఇనానిమస్‌గా అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. ఒప్పుకుంటారు కూడా. అదే హీరోయిన్స్ స్కిన్ షో. అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే అమ్మాయిల అంగాంగ ప్రదర్శన. కళాత్మక దర్శకుడిని అని, ఆర్ట్ సినిమాల హీరోయిన్ని అని చెప్పుకునేవాళ్ళేమో కళ కోసం అని సాకు చెప్తారు. కమర్షియల్ దర్శకులేమో ‘ప్రేక్షకులు చూస్తున్నారు…మేం తీస్తున్నాం’ అని రాజకీయ తెలివితేటలు చూపిస్తూ ఉంటారు. ఫైనల్‌గా అందరికీ కూడా స్త్రీ శరీరమే ఆయుధం అయిపోతోంది.
హీరోయిన్స్ కూడా అస్సలు తగ్గట్లేదు. మార్కెట్ ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ డామినేట్ చేస్తున్నట్టే సినిమా ఇండస్ట్రీని కూడా డబ్బే నడిపిస్తోంది. అందరికీ కూడా డబ్బే అవసరమవుతోంది. హీరోయిన్స్‌కి కూడా సేం టు సేం. హీరోయిన్స్ కాల పరిమితి కూడా చాలా తక్కువ. హీరోయిన్ లైఫ్ టైం మేక్సిమం టెన్ ఇయర్స్. అంతకుమించి ఉందంటే అద్భుతమే. అందులో కూడా స్టార్టింగ్ టూ ఇయర్స్ పెద్దగా డబ్బులు రావు. ఆ తర్వాత ఓ సక్సెస్ పడిందంటే మాత్రం పది చేతుల సంపాదన కూడా వాళ్ళ సొంతం. అయితే ఆ వెలుగులన్నీ చాలా తక్కువ టైమే ఉంటాయి. అందుకే సినిమాలలో హీరోయిన్ ఛాన్సులు, ఐటెం సాంగులు, షాప్ ఓపెనింగులు, ఫొటో షూట్స్, రకరకాల ప్రోగ్రామ్స్, ఈవెంట్స్…అబ్బో వందరకాల ఆదాయ మార్గాలు ఉన్నాయి. వాటన్నింటిలో అవకాశాలు రావాలంటే హీరోయిన్స్ అందం, బాడీ షేపులు ఓ రేంజ్లో ఉండాలి. అవి ఆడియన్స్‌ని బీభత్సంగా అట్రాక్ట్ చేయాలి. మాయ చేయాలి.
ఈ కాలం హీరోయిన్స్ కమర్షియల్ విషయాల్లో చాలా తెలివైన వాళ్ళని పాత కాలం నాటి హీరోయిన్స్ అందరూ కూడా సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటారు. ఆ తెలివి తేటలన్నీ ఇలాంటి విషయాల్లోనే అన్నమాట. సంస్కృతి అని, సాంప్రదాయాలనీ, ఇంకోటనీ…ఎలాంటి డౌట్స్ పెట్టుకోరు. ఎవ్వరి కామెంట్స్‌నీ కేర్ చేయరు. క్రిటిక్స్‌ని అసలే పెట్టించుకోరు. ఇంకా ఎక్కువ మాట్లాడితే….‘నాకు ఉన్నయ్..చూపిస్తున్నా…మీకేంటి?’ అని ఎదురుదాడికి దిగుతారు. ‘నా శరీరం గురించి మాట్లాడడం కంటే ఇంపార్టెంట్ విషయాలు చాలా ఉన్నాయి’ అని కౌంటర్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ మాటలు నిజమా? కాదా? అన్న విషయం పక్కనపెడితే ఈ అంగాంగ ప్రదర్శన శృతి మించడం కూడా సమాజానికి చేటు చేసేదే అనడంలో సందేహం లేదు. గత పదేళ్ళ నుంచి గనుక చూస్తే బికినీలన్నారు, లిప్ కిస్సులన్నారు, సెక్సీ రొమాన్స్ అన్నారు..ఇప్పుడిక న్యూడ్ వీడియోస్ అంటున్నారు. అదేమంటే లీకయ్యాయని అంటున్నారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళ పోకడలు గమనిస్తూ ఉంటే సినిమా లీకేజీ వార్తలు, ఇలాంటి వీడియో లీకేజీ వార్తలు ఏవీ కూడా అస్సలు నమ్మశక్యంగా లేవు. హీరోయిన్స్ స్కిన్ షో వ్యవహారం చేయిదాటిపోతోందన్నది వాస్తవం. విచ్చలవిడితనం సమజానికి ఎప్పుడూ చేటే చేస్తుంది. పరిధులు, కట్టుబాట్లు ఉంటేనే అది సమాజం అవుతుంది. ఎలాంటి కట్టుబాట్లు ఉండకూడదు. ఎవ్వరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉండొచ్చు అని చెప్పడమంటే అటవిక న్యాయానికి జై కొట్టినట్టు. వ్యక్తి స్వేఛ్చ ఒక్క విషయంలోనే కాదు…..డ్రెస్సింగ్ విషయంలో కూడా అటవిక కాలంలోకి వెళ్ళిపోతామా ఏంటి?