విశాఖపట్నం క్రమంగా ఎత్తుగా పెరుగుతోంది. నిర్మాణ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను వైజాగ్ రియల్ ఎస్టేట్ కూడా అందిపుచ్చుకుంటోంది. ఎత్తైన నిర్మాణాల వైపు అడుగులు వేస్తోంది. విశాఖలో ముఫ్పై అంతస్తుల మేర ఉండే లగ్జరీ అపార్టుమెంట్ల నిర్మాణాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ పది ప్రాజెక్టులు ఇలా ప్రతిపాదన, నిర్మాణం ప్రారంభ దశలో ఉన్నాయి.
వైజాగ్‌లో అత్యంత ఎత్తైన భవనం ఆక్సిజన్ టవర్స్ ..ఇది 35 అంతస్తులు ఉంటుంది. 2018లో ఈ ప్రాజెక్టు పూర్తి అయింది. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ లో స్లంప్ ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ భారీ ప్రాజెక్టులకు రంగం సిద్ధమవుతోంది. పలు సంస్థలు.. ఈ దిశగా ఆలోచన చేస్తున్నా యి. ఐటీ క్యాపిటల్‌గా విశాఖ మారే సూచనలు కనిపిస్తున్నాయి. హై శాలరీ ఎగ్జిక్యూటివ్‌లు విశాఖకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివిధ రకాలుగా ఆర్థిక రాజధానిగా విశాఖ మారుతున్నందున నివాస అవసరాలు భారీగా పెరగనున్నాయి.
విశాఖలో దూరంగా చూస్తే..బీచ్ కనిపించాలని కోరుకంటారు. అందుకే అక్కడ హై రైజ్ అపార్టుమెంట్లకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. బిల్డర్లు ఇప్పుడు ఆ దిశగా ప్లాన్ చేసే అవకాశం ఉంది. వచ్చే రెండేళ్లలో .. ఆకాశహర్మ్యాలు పెద్ద ఎత్తున విశాఖలో నిర్మాణంలోకి రానున్నాయని భావిస్తున్నారు.