[X] Close
[X] Close
జనసైనికులపై అక్రమ కేసులు కొట్టేసిన హైకోర్టు..! పోలీసులంటే అంతేనా..?

రాజకీయం కోసం ఏపీ పోలీసులు పెడుతున్న కేసులు వారి పరువు తీస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం… సోషల్ మీడియా పోస్టులు పెట్టారంటూ.. అదుపులోకి తీసుకున్న కొంత మందిని పోలీసులు అరెస్ట్ చేసి చూపించలేదు. దీనిపై.. కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన విషయంలో ఏపీ పోలీసుల తీరు.. వివాదాస్పదమవుతూండగానే.. కొత్తగా జనసేన నేతలపై పోలీసులు పెట్టిన కేసులపై.. హైకోర్టు తీవ్రంగా స్పందించింది. జనసేన నేతలపై పోలీసులు పెట్టిన కేసును హైకోర్టు కొట్టి వేసింది. అక్టోబర్ 17న గుంటూరు జిల్లా దుర్గి మం. ధర్మవరంలో జన సైనికులు ఓ నాటకం ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు అనుమతి లేదంటూ.. పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఏకంగా 34 మంది జనసైనికులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. దీనిపై పవన్ కల్యాణ్ కూడా తీవ్రంగా స్పందించారు. ఒక పోలీస్ అనాలోచిత నిర్ణయం కారణంగా.. అతడి పక్షపాత ధోరణి వల్ల ధర్మవరం గ్రామంలో అశాంతి రాజ్యమేలుతుందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అక్రమకేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో.. జనసేన లీగల్ సెల్ హైకోర్టులో పిటిషన్ వేసి.. అది అక్రమ కేసు అని వాదిస్తూ.. ఆధారాలను సమర్పించింది. దీన్ని పరిశీలించిన హైకోర్టు పోలీసులపై మండిపడింది. కేసు పూర్వాపరాలు పరిశీలించకుండా కేసు ఎలా పెడతారని పోలీసుల్ని ప్రశ్నించింది.

ఈ ఒక్క కేసు మాత్రమే కాదు.. ఏపీలో రాజకీయ కారణాలతో… ఇతర పార్టీలపై పెట్టే కేసులు భారీగా నమోదవుతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన అనే తేడా లేదు.. ఎవరైనా.. తమకు ఎదురు వస్తే.. వారిని పోలీసుల దగ్గరకే తీసుకెళ్తున్నారు వైసీపీ నేతలు. ఈ క్రమంలో.. గ్రామాల్లో భయాందోళనలు నెలకొంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com

Most Popular

ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగించిన ఒడిశా

కరోనా వ్యాప్తి నివారించడానికి భారత ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఏప్రిల్ 15వ తేదీన ముగియనుంది. అయితే ఏప్రిల్ 15వ తేదీకి లాక్ డౌన్ ఎత్తివేసే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం...

క‌రోనా ఎఫెక్ట్ : బొమ్మ‌కి ‘బొమ్మ’ క‌నిపించ‌డం ఖాయం

బిఫోర్ క‌రోనా - ఆఫ్ట‌ర్ క‌రోనా అని విడ‌దీసుకుని చూసుకోబోతున్నామేమో..? ప‌రిస్థితులు అలానే క‌నిపిస్తున్నాయి. ఎందుకు పుట్టిందో తెలీదు గానీ, ఈ మ‌హ‌మ్మారి వ్య‌వ‌స్థ‌ల‌న్నింటినీ త‌ల‌కిందులు చేసేసింది. మ‌నిషి మ‌నుగ‌డ‌కే ప్ర‌శ్నార్థ‌కంగా...

12 గంటల్లో ఏపీలో ఒక్కటీ నమోదు కాని పాజిటివ్ కేస్.!

ఆంధ్రప్రదేశ్‌లో గత పన్నెండు గంటల్లో ఒక్కటంటే.. ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. నిన్న రాత్రి తొమ్మిది గంటల నుండి ఈ ఉదయం తొమ్మిది గంటల వరకూ... చేసిన...

అయితే పచ్చ మీడియా..లేకపోతే కులం..! వైసీపీ ఎదురుదాడి అస్త్రాలు ఈ రెండే..!?

ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్శిటీల పాలక మండళ్ల నియామకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న దశలో.. యంత్రాంగం మొత్తం... దానిపైనే దృష్టి పెట్టినా... హఠాత్తుగా వర్శిటీల...

HOT NEWS