సాయి పల్లవి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. కశ్మీర్ ఫైల్స్ సినిమాతో పాటు గోరక్షకులపై సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని భజరంగ్‌దళ్ నాయకులు ఇటీవల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. భజరంగ్‌దళ్ నాయకుల ఫిర్యాదుపై న్యాయసలహా తీసుకొని కేసు నమోదు చేసిన పోలీసులు సాయిపల్లవికి గత నెల 21న నోటీసులు జారీ చేశారు. ఐతే నోటీసులు రద్దు చేయాలని కోరుతూ సాయి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సాయి పల్లవి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.
‘విరాటపర్వం’ సినిమా ప్రచారంలో ‘‘ కశ్మీర్ పండిట్లను ఎలా చంపారో.. కొవిడ్ సమయంలో ఓ ప్రాంతంలో గోవును వాహనంలో తరలించిన ఓ ముస్లిని కొంతమంది కొట్టి జై శ్రీరాం, జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. అప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు జరిగిన దానికి తేడా ఏముంది? ’’అని సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఇప్పుడు కోర్టులో వుంది.