హత్య కేసులో విచారణ జరగకుండా చూడాలని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. ఈ కేసును పునర్విచారణ చేయాలని రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. రాజమండ్రి కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో నిన్న సవాలు చేస్తూ పిటిషన్ వేసిన అనంతబాబుకు దీంతో షాక్ తగిలినట్లయింది.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రభుత్వం ఇప్పటికే సిట్‌ను నియమించింది. హత్యలో అనంతబాబుకు సహకరించినవారిపై SIT ఫోకస్ చేసింది. 90 రోజుల్లో విచారణ పూర్తి చేసే యోచనలోసిట్ ఉంది. 2022 మేలో డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేశాడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. అనంతబాబును వెనుకుసుకుని వచ్చిన నాటి మఖ్యమంత్రి జగన్ కారణంగా పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయలేదు. కేసు విషయంలో న్యాయం చేస్తామని, నిందితులను శిక్షిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక లాయర్ ను నియమించారు
కేసుపై లోతైన విచారణ చేయడంతోపాటు 90 రోజుల్లో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేయాలని ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గతంలో విచారణలో లోపాలను గుర్తించి….90 రోజుల్లో పూర్తి విచారణ పూర్తి చేసే దిశగా సిట్ కార్యాచరణ ప్రారంభించింది. ఇప్పటికే అనంతబాబుకు నాడు గన్ మెన్లుగా ఉన్న వారిని విచారించింది. ఒక్కడే హత్య చేసి, డెడ్ బాడీని తరలించే అవకాశం లేదని…సహకరించిన వారు ఎవరనేది సిట్ తేల్చనుంది.