తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్‌నుంచి మరో మొట్టికాయ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ బోర్డ్‌వారి బ్యాంక్ ఖాతాను స్తంభింపజేసినందుకుగానూ తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డ్ దాఖలుచేసిన పిటిషన్‌‍పై స్పందిస్తూ తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డ్ కార్యదర్శికి సమన్లు పంపాలని ఛీఫ్ జస్టిస్ దిలీప్ భోసలే, జస్టిస్ ఎస్.వి.భట్‌లతోకూడిన ధర్మాసనం ఆదేశించింది. ఆస్తులు, అప్పుల విభజన, వేర్వేరు ఇంటర్మీడియెట్ బోర్డుల ఏర్పాటు, వేర్వేరు బ్యాంక్ ఖాతాల ప్రారంభం జరిగిన తర్వాతకూడా తెలంగాణ అధికారులు తమ ఖాతాను స్తంభింపజేశారని ఏపీ అధికారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్యాంక్ అధికారులుకూడా తమను సంప్రదించకుండా తెలంగాణ అధికారుల సూచనప్రకారం తమ ఖాతాను స్తంభింపజేశారని ఆరోపించారు. దీనితో తమ బోర్డ్ కార్యకలాపాలన్నీ ఆగిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఏపీ ఖాతాను స్తంభింపజేసేముందు బ్యాంక్ అధికారులు లీగల్ ఒపీనియన్ తీసుకోవటంగానీ, కోర్టును సంప్రదించటంగానీ చేసి ఉండాల్సిందని హైకోర్ట్ ధర్మాసనం అభిప్రాయపడింది. ఖాతాను స్తంభింపజేయాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నారో చెప్పటానికి తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డ్ కార్యదర్శిని కోర్టుకు పిలిపించాలని నిర్ణయించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇండియా టుడే ఈ సారి జగన్‌ను మర్చిపోయిందేంటో..!?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెస్ట్ చీఫ్ మినిస్టర్ అంటూ అదే పనిగా పోల్స్ విడుదల చేసే ఇండియా టుడే ఈ సారి తమ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్స్‌లో వైఎస్ జగన్మోహన్...

కో అంటే కోట్లు : రాముడికి పారిశ్రామికవేత్తల భక్తి సమర్పణ..!

మైహోమ్ గ్రూప్ రూ. ఐదు కోట్లు..! మేఘా గ్రూపు రూ. ఆరు కోట్లు..! గోకరాజు గంగరాజు గ్రూప్ రూ. ఐదు కోట్లు..! రాంకీ గ్రూప్ అయోధ్య రామిరెడ్డి రూ. ఐదు కోట్లు..! సుజనా...

“మైహోమ్” రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌పై కేంద్రం విచారణ..!

హైదరాబాద్ శివారులో మైహోమ్ గ్రూప్ చేపట్టిన ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి భారీ భవనాలు నిర్మిస్తున్నారని అందిన ఫిర్యాదులపై విచారణ ప్రారంభించింది. నార్సింగి...

మ‌హేష్ అక్క‌డ‌.. ప‌వ‌న్ ఇక్క‌డ‌

ఈరోజు ముహూర్తం బాగుందేమో..? ఒకేసారి ఇద్ద‌రు స్టార్ హీరోల సినిమాలు ప‌ట్టాలెక్కేశాయి. మ‌హేష్ బాబు దుబాయ్ లో.. బిజీగా ఉంటే, ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్ లో ప‌నిలోకి దిగిపోయాడు. మ‌హేష్...

HOT NEWS

[X] Close
[X] Close