ఆధారాల్లేవన్న సీఐడీ.. స్టే ఇచ్చిన హైకోర్టు..!

ప్రాథమిక దర్యాప్తులో ఏం వివరాలు తేలాయని హైకోర్టు న్యాయమూర్తి అడిగారు..! విచారణ తొలి దశలో వివరాలు చెప్పలేమని ప్రభుత్వం తరపు న్యాయవాది న్యాయమూర్తికి నేరుగా చెప్పేశారు. ఆ న్యాయవాది సమాధానం విని… కోర్టు హాల్లోని ఇతర న్యాయవాదులు ఉలిక్కి పడ్డారు. హైకోర్టు న్యాయమూర్తికే విచారణ వివరాలు చెప్పకపోతే.. ఇంకెవరికి చెబుతారన్న డౌట్ రావడమే దీనికి కారణం. చివరికి న్యాయమూర్తి… సీఐడీ నమోదు చేసిన కేసు విచారణపై నాలుగు వారాలు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు, నారాయణకు వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయా అని హైకోర్టు ప్రశ్నించినప్పుడు సీఐడీ తరపు న్యాయవాది.. దర్యాప్తు కొనసాగిస్తే సాక్ష్యాలు వస్తాయని వాదించారు. ఫిర్యాదు, స్టేట్‌మెంట్లు ఉన్నాయి.. ఇంకా ఆధారాలేం కావాలి అని ఎదురు ప్రశ్నించారు. రైతులు నష్టపోలేదు.. ఎవరూ ఫిర్యాదు చేయకుండా కేసు ఎలా పెడతారని హైకోర్టు ప్రశ్నించింది. సీఆర్డీఏలోని సెక్షన్‌ 146 ప్రకారం.. అధికారులను ఎలా విచారణ జరుపుతారని హైకోర్టు సీఐడీ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. వీటన్నింటికీ సీఆర్డీఏ తరపు న్యాయవాది.. స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. దీంతో నాలుగు వారాల స్టే ఇస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

అసలు బాధితులు లేరు.. ప్రాథమిక ఆధారాలు లేవు.. ఏమీ లేకుండా ఉద్దేశపూర్వకంగా రాజకీయ ప్రేరేపితంగా కేసు పెట్టారని చంద్రబాబు తరపు న్యాయవాది హైకోర్టు ధర్మాసనం ముందు వాదించారు. నారాయణ తరపు న్యాయవాది కూడా అదే చెప్పారు. అసలు నేరం జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు పెట్టడం .. రాజకీయంగా అవినీతిపై ప్రశ్నించకుండా ఉండటానికేనని.. వాదించారు. ఇలాంటి సమయంలో ఆధారాలు చూపించాల్సిన ప్రభుత్వం తరపు న్యాయవాది… కోర్టుకు వివరాలు చెప్పలేమని చెప్పుకొచ్చారు.

ఓ వైపు విచారణ జరుగుతున్న సమయంలోనే తాడేపల్లిలో సీఐడీ అధికారులు విచారణ పేరుతో హడావుడి చేశారు. రాజధానికి భూములిచ్చిన రాజధాని రైతుల్ని.. మాజీ సీఆర్‌డీఏ అధికారుల్ని పిలిచి ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు మీడియాకు … లీకులు ఇచ్చి కావాల్సినంత హంగామా సృష్టించారు. వారిని పిలిచి కీలక సమాచారం తీసుకుంటున్నట్లుగా మీడియాకు లీకులిచ్చారు. అయితే ఆ రైతులు… తాము ఇష్ట పూర్వకంగానే భూములిచ్చామని … ఎవరూ బెదిరించలేదని ప్రభుత్వం నుంచి పరిహారం కూడా అందిందని వాంగ్మూలం ఇచ్చి వచ్చారు. ఆ తర్వాత సీఆర్‌డీఏ కమిషనర్‌గా పని చేసిన చెరుకూరి శ్రీధర్‌ను ప్రశ్నించారు. మూడు గంటల పాటు ఆయనను ప్రశ్నించినట్లు ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థలకు సమాచారం లీక్ చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కత్తి మహేష్ టెంప్లేట్ వైకాపా వదలదా? కత్తి స్థానాన్ని పోసాని భర్తీ చేయగలరా ?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైఎస్ఆర్సిపి మంత్రులు వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటూ చిన్న సైజు యుద్ధమే జరుగుతుంది. సినిమా టికెట్లను ప్రభుత్వ పోర్టల్ ద్వారా అమ్మాలి అన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పవన్...

పోసాని మళ్లీ రచ్చ – దాడికి ప్రయత్నించిన పవన్ ఫ్యాన్స్ !

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరోసారి మీడియా ముందుకు వచ్చిన పోసాని కృష్ణమురళి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం పెట్టి "పవన్ నీకెంత...

ప్రజల వరద కష్టాల కన్నా మీడియాకు సినిమా గొడవలే మిన్న !

ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో తుపాన్ బీభత్సం సృష్టించింది. ఏపీలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పటికీ తేరుకోలేదు. కొన్ని వందల గ్రామాల్లో అంధకారం అలుముకుంది. ఇక నష్టపోయిన వారి గురించిచెప్పాల్సిన...

పంజాబ్ కాంగ్రెస్ చిందర వందర !

అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదో చేద్దామని ప్రయత్నించిన కాంగ్రెస్ హైకమాండ్... పంజాబ్ లో పార్టీని చిందర వందర చేసుకుంది. సిద్దూకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి అందర్నీ కూల్ చేయాలనుకుంటే చివరికి అదే...

HOT NEWS

[X] Close
[X] Close