ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలు అడిగిన హైకోర్టు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని .. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఆధారాలు ఉంటే సమర్పించాలని ఆదేశించింది. ఈ పిటిషన్ దాఖలు చేసిన శ్రావణ్ కుమార్.. ఏపీ సర్కార్ .. ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా అధికారిని నియమించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ అధికారి పేరు చెప్పాలని ధర్మాసనం శ్రావణ్ కుమార్‌ను కోరింది. అయితే.. ప్రత్యేకంగా అఫిడవిట్ దాఖలు చేస్తానని శ్రావణ్ కుమార్ చెప్పారు. రాజకీయ నాయకుల మాదిరిగా న్యాయమూర్తులకు కూడా షాడో పార్టీలను నియమించారని శ్రవణ్ కోర్టుకు తెలిపారు. దీంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల ఇరవయ్యో తేదీకి విచారణకు వాయిదా వేసింది.

వాదనలు జరుగుతున్న సమయంలో.. ప్రభుత్వ తరపు న్యాయవాది విచారణ అవసరం లేదన్నట్లుగా వాదిస్తూండటంతో.. విచారణ జరిపితే.. మీకు ఇబ్బందేమిటని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ పిటిషన్‌లో న్యాయదేవతపై నిఘాపేరుతో కథనం రాసిన ఆంధ్రజ్యోతిని కూడా పార్టీని చేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. ఆ కథనాన్ని చదివి వినిపించాలని హైకోర్టు కోరింది.

కథనంలో ఏముందో అడిగి తెలుసుకుంది. ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేసినా అది చిన్న విషయం కాదని.. దర్యాప్తుకు ఆదేశిస్తే అసలు విషయాలు బయటపడతాయి కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై ఏమైనా అభ్యంతరం ఉందా అని ప్రభుత్వం తరపున న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది.

ప్రభుత్వం తరపున అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ట్యాపింగ్‌పై విచారణ చేయించాలా లేదా.. అ్నది .. ఆ రోజే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. నేరుగా న్యాయమూర్తుల ఫోన్లే ట్యాప్ చేశారని న్యాయవాది పిటిషన్ వేశారు . ఆ అంశంలో ఎలాంటి నిజం లేదని భావిస్తే హైకోర్టు ధర్మాసనం.. అభ్యంతరం చెప్పేదేనని న్యాయనిపుణులు చెబుతున్నారు. గురువారం..హైకోర్టు నిర్ణయం కీలకం కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ‘నిఫా వైర‌స్‌’

ప్ర‌పంచం మొత్తం.. క‌రోనా భ‌యంతో వ‌ణికిపోతోంది. ఇప్పుడైతే ఈ ప్ర‌కంప‌న‌లు కాస్త త‌గ్గాయి గానీ, క‌రోనా వ్యాపించిన కొత్త‌లో... ఈ వైర‌స్ గురించి తెలుసుకుని అల్లాడిపోయారంతా. అస‌లు మ‌నిషి మ‌నుగ‌డ‌ని, శాస్త్ర సాంకేతిక...

సర్వేలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్సే..!

గ్రేటర్ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ మొత్తం బోల్తా కొట్టాయి. ఒక్కటంటే.. ఒక్క సంస్థ కూడా సరిగ్గా ఫలితాలను అంచనా వేయలేకపోయింది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వేవ్ ను...

కాంగ్రెస్ పనైపోయింది..! ఉత్తమ్ పదవి వదిలేశారు..!

పీసీసీ చీఫ్ పోస్టుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తాను ఎప్పుడో రాజీనామా చేశానని.. దాన్ని ఆమోదించి.. కొత్తగా పీసీసీ చీఫ్ ను నియమించాలని ఆయన కొత్తగా ఏఐసిసికి లేఖ రాశారు....

గ్రేటర్ టర్న్ : టీఆర్ఎస్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్..!

గ్రేటర్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన ఫలితాలు సాధించింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కాస్త ముందు ఉన్నట్లుగా కనిపిస్తోంది కానీ.. భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్‌పై సర్జికల్‌ స్ట్రైక్...

HOT NEWS

[X] Close
[X] Close