ఏపీ సర్కార్‌పై హైకోర్టు రాజ్యాంగ ఉల్లంఘన ప్రక్రియ..!?

రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ.. ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు ఇటీవలి కాలంలో ఎన్నో సార్లు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. మూడు సార్లు డీజీపీని కోర్టుకు పిలిపించింది. అయినప్పటికీ మార్పులు రాలేదు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు .. వాటి విషయంలో తీర్పులు చెప్పినందుకు హైకోర్టును … న్యాయమూర్తులను నిందించిన వైనంపై.. కూడా న్యాయస్థానం సీరియస్ అయింది. అయినా ప్రభుత్వంలో ఏ మాత్రం కదలిక కనిపించడం లేదు. హైకోర్టుపైనే ఎదురుదాడికి దిగుతూ.. తనదైన రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. దీంతో హైకోర్టు ఏపీలో రాజ్యాంగ విచ్చిన్నం జరిగిందో లేదో తేల్చాలని నిర్ణయించింది.

గతంలో శాసనమండలిని తర్వాత ఎస్‌ఈసీని ..ఇప్పుడు హైకోర్టును టార్గెట్ చేసుకున్నారని న్యాయమూర్తి ఓ హేబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పరిణామాలను గమనిస్తున్నామని.. రాజ్యాంగ ప్రక్రియ ద్వారా పాలన జరుగుతుందా..? లేదా అనే అంశంపై విచారించి..న్యాయస్థానాలు ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలపై పరిశీలిస్తున్నామని తెలిపింది. న్యాయపరమైన అవకాశాలను పరిశీలించి తమకు తెలియచేయాలని.. పిటిషనర్ తరపున న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించింది. సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై వచ్చిన పోస్టింగ్స్‌పై.. రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు చేసినా సీరియస్‌గా తీసుకోకపోవడం గమనించామని.. రాజ్యాంగ ప్రక్రియ ద్వారా పాలన జరుగుతుందా లేదా అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.

రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే హైకోర్టులు ఎలాంటి చర్యలు తీసుకోగలవన్న అంశాలపై న్యాయనిపుణులు ఇప్పుడు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది.సహజంగా… ప్రభుత్వాలు న్యాయవ్యవస్థ విషయంలో హద్దులు దాటవు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో అలాంటి పరిస్థితి రాలేదు. ఇప్పుడు ఏపీలో వచ్చింది. పెద్ద ఎత్తున ప్రజాతీర్పు వచ్చింది కాబట్టి.. తాము అన్నింటికీ అతీతం అనుకునే పాలకుల వల్ల సమస్య వచ్చింది. చివరికి హైకోర్టునే లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పుడీ పరిణామాలు ఎటు దారి తీస్తాయో వేచి చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిదే దేశద్రోహం కాదు..! మరి రక్షణ దేశంలో ఉందా..!?

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన దేశ ద్రోహం కిందకు రాదని సుప్రీం కోర్టు తేల్చేసింది. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై దాఖలైన కేసులో కోర్టు ఈ మేరకు కీలక తీర్పు చెప్పింది....

ఏపీలో పోర్టులన్నీ ఆదాని పరం..!

ఆంధ్రప్రదేశ్ ప్లస్ పాయింట్ సుదీర్ఘ తీరమని.. పోర్టులతో తట్టుకోలేనంత అభివృద్ధి చేస్తామని గత ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం కూడా.. చాలా చాలా మాటలు చెబుతూ ఉంటాయి. కానీ.. వాస్తవానికి కొత్త...

“అన్యాయ మాటలు”.. సీజేఐ వైదొలగాలనే డిమాండ్లు..!

చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే భారత రాజ్యాంగం, చట్టాల పట్ల సంపూర్ణమైన అవగాహనతో ఉంటారని అనుకుంటారు. నిన్నామొన్నటి వరకూ సీజేఐ బోబ్డేపై అలాంటి అభిప్రాయమే ఉండేది. అయితే.. మహారాష్ట్రకు చెందిన...

శశికళ రిటైర్డ్ హర్ట్ మాత్రమే..రిటైర్మెంట్ కాదు..!

శశికళ అమ్మ జయలలిత సమాధి మీద శపథం చేశారు. జైల్లో ఓపిగ్గా శిక్ష అనుభవించారు. రిలీజై వచ్చిన తర్వాత రాజకీయాల్లో తేల్చుకుంటానన్నారు. అయితే హఠాత్తుగా రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటున్నానని ప్రకటించారు. ఇది...

HOT NEWS

[X] Close
[X] Close