టీ సర్కార్‌కు హైకోర్టు సెకండ్ వేవ్ అక్షింతలు షురూ..!

మొదటి విడత కరోనా వేవ్ సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి పడిన అక్షింతలు అన్నీ ఇన్నీ కావు. కరోనాకు సెకండ్ వేవ్ వచ్చినట్లుగా ఈ విషయంలో హైకోర్టు నుంచి కూడా… తెలంగాణ సర్కార్‌కు సెకండ్ వేవ్ ప్రారంభమైనట్లుగా ఉంది. కరోనా టెస్టింగ్ విషయంలో తెలంగాణ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హైకోర్టు మండిపడింది.గత విచారణలో నివేదిక సమర్పించాలని ఆదేశించడంతో.. కరోనా పరీక్షలు, చికిత్స, నియంత్రణపై ప్రభుత్వ నివేదికను అందించారు. అయితే స్కూళ్లపై నియంత్రణ పెట్టిన ప్రభుత్వం.. బార్లు, పబ్‌లు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించలేదని న్యాయస్థానం ప్రశ్నించింది.

రాపిడ్‌ టెస్టులపైనే దృష్టి పెట్టారని .. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు 10 శాతం కూడా లేవని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలపై వెంటనే స్టేటస్‌ రిపోర్ట్‌ ఇవ్వాలని.. కరోనా పాజిటివ్, మరణాల రేటును వెల్లడించాలని స్పష్టం చేసింది. 48 గంటల్లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశిస్తే..మధ్యాహ్నానికే హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ వేగం హైకోర్టును ఇంప్రెస్ చేయలేదు. నివేదికను పరిశీలించి.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోసారి సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ విచారణ జరుపుతున్న చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

దీంతో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో సులువుగా అర్థమవుతోందన్న కామెంట్లు సోషల్ మీడియాలో వినిపించాయి. సోమేష్ కుమార్ ఉదయం వరకూ అధికారిక విధుల్లో చురుగ్గా పాల్గొన్నారు. సోమవారం సీఎం కేసీఆర్‌తో జరిగిన సమావేశంలోనూ పాల్గొన్నారు. ఓ వైపు.. కరోనా టెస్టులు సరిగ్గా చేయడం లేదని కోర్టు అక్షింతలు వేయడం..మరో వైపు ప్రభుత్వ అధికార యంత్రానికి బాస్ లాంటి సోమేష్ కుమార్‌కు కరోనా సోకడం.. అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close