ఏపీలో పారిశ్రామిక అభివృద్ధిని అడ్డుకోవడానికి చేయగలిగినన్ని అడ్డగోలు పనులు వైసీపీ నేతలు, సానుభూతిపరులు చేస్తూనే ఉన్నారు. విశాఖకు టీసీఎస్ వస్తోందంటే.. ఆపేందుకు కోర్టుకు కూడా వెళ్లారు. విశాఖ సంస్థకు చాలా తక్కువ ధరకు భూములు కేటాయించారని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ విచారణ న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో పారిశ్రామికాభివృద్ధి ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని.. నామమాత్రపు ధరకు భూములు కేటాయిస్తే తప్పేమిటని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఆ భూముల విలువ కాదని.. ఆ పరిశ్రమ రావడం వల్ల ఏపీకి జరిగే లాభాన్ని చూడాలన్నారు. ఈ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. తదుపరి విచారణ వాయిదా వేశారు.
ఏపీకి, విశాఖకు దిగ్గజ పరిశ్రమల్ని ఆకర్షించడానికి ప్రభుత్వం భూమిని నామ మాత్రపు లీజు పద్దతిన ఇస్తోంది. ఈ భూమిని ఆయా సంస్థలు అమ్ముకోలేవు అలాగే ఇతర అవసరాలకు ఉపయోగించలేవు. పూర్తిగా కేటాయించిన అవసరాలకు మాత్రమే వినియోగించాలి. అయినా ఆ భూముల వల్ల పెద్ద ఎత్తున ఆయా సంస్థలకు లాభం జరుగుతోందని.. ఏపీకి నష్టం జరుగుతోందని కొంత మంది ప్రచారం చేస్తూ..కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని చూస్తున్నారు.