అమరావతి నిర్మాణం ఊపందుకుంటున్న సమయంలో విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు ఉపాధి కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఇళ్ల లావాదేవీలు కూడా పెరుగుతున్నాయి. గుంటూరు శివారులో ఇప్పుడు ఎక్కువ మంది ఇల్లు కొనడంలేదా ఇంటి స్థలం కోసం చూస్తున్న ప్రాంతం, గోరంట్ల, లాం. గోరంట్ల నగరంలోని మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ , అమరావతి రోడ్‌కు సమీపంలో ఉంటుంది. ఇది డిమాండ్ ను మరింతగా పెంచుతోంది.
గోరంట్ల భవిష్యత్‌లో వ్యాపార కేంద్రం అవుతుందన్న అంచాలు ఉన్నాయి. అందుకే చాలా కాలం నుంచి అక్కడ స్థలాలపై పెట్టుబడులు పెట్టేవారు పెరిగిపోయారు. ఇటీవలి కాలంలో కొత్త కాలనీల్లో ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటోంది. గోరంట్లలో అపార్ట్మెంట్లు , ఇండిపెండెంట్ హౌస్‌లు అధిక రెంటల్ డిమాండ్‌ను కలిగి ఉన్నాయి, ముఖ్యంగా విద్యార్థులు , ఉద్యోగుల కారణంగా. 2 BHK అపార్ట్మెంట్లకు నెలకు 10,000 నుంచి 15,000 రెంటల్ లభిస్తోంది.
గోరంట్లలో రెసిడెన్షియల్ ప్లాట్ల ధరలు ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువే ఉన్నాయి. చదరపు గజం (స్క్వేర్ యార్డ్)కు 20,000 నుండి 30,000 వరకు ఉన్నాయి. 200 చ.గ. ప్లాట్ ధర సుమారు 30 లక్షల నుండి 60 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ౨ BHK అపార్ట్మెంట్లు 45 లక్షల నుండి 60 లక్షల వరకు అందుబాటులోఉన్నాయి. 3 BHK అపార్ట్మెంట్లు 70 లక్షల నుండి 95 లక్షల వరకు స్థానిక బిల్డర్లు అమ్ముతున్నారు. ఇండిపెండెంట్ హౌస్‌లు రూ. 65 లక్షల నుండి కోటి రూపాయల వరకు లభిస్తున్నాయి.
గోరంట్ల అమరావతి రాజధాని ప్రాంతానికి సమీపంలో ఉండటం వల్ల, రాబోయే 5-10 సంవత్సరాలలో ఆస్తి విలువలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది . అందుకే ఎక్కువ మంది చూపు గోరంట్ల వైపు ఉంటోంది.