తెలంగాణలో ఇప్పుడు పొలిటికల్ గా హాట్ టాపి టాపిక్ అవుతోంది హిల్ట్ పాలసీ. ఎప్పుడో దశాబ్దాల కిందట పరిశ్రమలకు ఇచ్చిన భూముల్ని.. పరిశ్రమల కోసం కాకుండా రియల్ ఎస్టేట్ కు కూడా ఉపయోగించుకునేలా మార్చే పాలసీ ఇది. నిజానికి అవి హైదరాబాద్లో ఉన్న పరిశ్రమల భూములు ప్రభుత్వ భూములు కావు, పరిశ్రమల యజమానులే వాటి అసలు ఓనర్లు . భూములు ఇచ్చేటప్పుడు పరిశ్రమకు మాత్రమే అని ఇస్తారు. ఇప్పుడు మల్టీ యూజ్ కు మారుస్తున్నారు. ప్యూర్ లీజ్ భూములను ప్రభుత్వం అమ్మడం లేదు.
పరిశ్రమలకు ఇచ్చే భూములు రెండు రకాలు
పరిశ్రమలకు ప్రభుత్వం భూములు కేటాయిస్తే..రెండు రకాలుగా కేటాయిస్తుంది. మొదట లీజుగా ఇస్తారు. పరిశ్రమను నిర్మించి ఇక విజయవంతంగా నడుస్తుంది అనుకున్న తర్వాత యాజమాన్య హక్కులు ఇస్తారు.అప్పుడు కూడా పరిశ్రమ కోసమే వినియోగించాలని రూల్ పెడతారు. పూర్తిగా లీజుకు ఇవ్వడం మరో పద్దతి. ఇవి యాజమాన్యం మారదు. లీజ్ ఒప్పందం మేరకే వినియోగం ఉంటుంది.కొన్ని పరిశ్రమలకు లీజు పద్దతిలోనే కేటాయిస్తారు. ప్రభుత్వం ఇప్పుడు ఏళ కిందట.. లీజు పద్దతిలో కేటాయించి.. యాజమాన్య హక్కులు కల్పించిన పరిశ్రమల భూముల గురించే మాట్లాడుతోంది. అవి వారివే. కేవలం.. పరిశ్రమ కోసమే ఉపయోగించాలన్న రూల్ మాత్రం మారుస్తున్నారు.
గతంలో బీఆర్ఎస్ భారీగా ఫఈజు వసూలు
కాంగ్రెస్ ప్రభుత్వం భూమి ఫేసింగ్ రోడ్డును బట్టి 30 శాతం, 50 శాతం రిజిస్ట్రేషన్ విలువను ఫీజులుగా వసూలు చేయాలని అనుకుంటోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం లీజడ్ భూములకు కూడా 200 శాతం రిజిస్ట్రేషన్ విలువను ఫీజుగా వసూలు చేసింది. అందుకే ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం కాలుష్య కారక పరిశ్రమల్ని బయటకు పంపాలని.. సిటీలో మరింత నివాస స్పేస్ అందుబాటులోకి తేవాలని అనుకుంటోంది. కానీ అమ్మేసి లక్షల కోట్ల స్కాం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
ఆ భూములు ఇచ్చిన రైతులకూ లాభం ఉండాలి !
ఈ పరిశ్రమల కోసం 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం భూసేకరణ జరిపింది. వాళ్ల వద్ద నుంచే భూమిని పరిశ్రమల కోసం తీసుకున్నారు. ఆ కుటుంబాల పిల్లలు ఇప్పుడు ఒకప్పుడు ఇది మా భూమి అని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ భూములను పరిశ్రమలకు వాడకుండా, అపార్ట్మెంట్లు, ఆస్పత్రులు, కమర్షియల్ బిల్డింగ్లు కట్టేందుకు వాడేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో అప్పట్లో భూమి కోల్పోయిన కుటుంబాలకు ఎంతో కొంత మేలు చేసే ప్రయత్నం చేయాలి. చట్టం ప్రకారం కూడా ప్రజావసరం కోసం తీసుకున్న భూమిని వేరే ప్రయోజనానికి వాడితే అధికార దుర్వినియోగం అవుతుంది. ఈ కోణంలో అయినా ఆ భూముల పాత యజమానులకు మేలు చేయాల్సి ఉంటుంది.
