పాక్ లో హిందూ ఆలయ పునరుద్ధరణ !

అది పాకిస్తాన్ లోని శివాలయం. పాండవులు రహస్య జీవనం సాగిస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా లింగప్రతిష్ఠ చేశాడు. అంతేకాదు, మహాదేవుడు తన పత్ని సతీదేవితో కొంతకాలం ఇక్కడే కాపురం చేశాడని అంటారు. అలాంటి ఆలయం దేశ విభజన తర్వాత శిథిలమైంది. కానీ హిందూత్వ పునాదులు చెదరిపోలేదు. అక్కడ ఆలయ పునరుద్ధరణ జరుగుతూనే ఉంది. ఇరుదేశాల మధ్య శాంతి చేకూరాలని భక్త బృందాలు ప్రార్థిస్తూనే ఉన్నాయి.

పాకిస్తాన్ లో ఉన్నవాళ్లంతా హిందూ వ్యతిరేకులుకారనడానికి నిదర్శనం అక్కడి ఈ హిందూ ఆలయ పునరద్ధరణ. భారత-పాకిస్తాన్ మధ్య శాంతి చేకూరాలని ఈ ఆలయంలో ఏటా ప్రార్థనలు జరుగుతుండటం మరో విశేషం. దేశ విభజన (1947)కి ముందు పంజాబ్ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం, `విభజన’ అనంతరం పాకిస్తాన్ లోని పంజాబ్ (పశ్చిమ పంజాబ్) రాష్ట్రం లోని చక్వాల్ జిల్లాలో కలిసిపోయింది. అయినప్పటికీ ఘన చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని సందర్శించుకోవాలని భారతీయ భక్తులు తపనపడుతుంటారు.

120మందితో కూడిన భక్తబృందం రెండు రోజుల పర్యటనలో భాగంగా మొన్నీమధ్యనే కతాస్ రాజ్ ఆలయాలున్న ప్రాంతానికి చేరుకుంది. వారికక్కడ పాకిస్తాన్ అధికారికంగా స్వాగతం పలకడం విశేషం. భక్తుల కోసం ఆలయ పునరుద్ధరణతో పాటు వసతి సౌకర్యాలను మెరుగుపరిచారు. పవిత్రమైన ఈ ఆలయప్రాంగణాన్ని ఇండో-పాక్ ప్రజలు శాంతికి చిహ్నంగా భావిస్తుంటారు. అందుకు ఇరు దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని భక్తులు మనఃస్ఫూర్తిగా కోరుకుంటారు.

కతాస్ రాజ్ మందిర్ గా పిలుస్తున్న ఈ హిందూ ఆలయ ప్రాంగణంలో శివాలయం అత్యంత పురాతనమైనది. మహాభారత కాలంనాటిదిగా భావిస్తుంటారు. పాండవులు కొంతకాలం రహస్య జీవనం గడిపినప్పుడు ఈ ప్రాంతంలో తలదాచుకున్నారని అంటారు. అప్పట్లో శ్రీకృష్ణుడి చేతులమీదగా లింగప్రతిష్ట జరిగిందని, అదే ఈ ఆలయమని విశ్వసిస్తుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో చిన్నచిన్న గుడులు చాలానే ఉన్నాయి. ఈ ఆలయం ఎదురుగా కోనేరు ఉంది. దీనికీ ఒక కథ చెబుతుంటారు. పరమ శివుడు సతీదేవిని వివాహమాడిన తర్వాత కొంతకాలం ఈ ప్రాంతంలో కాపురమున్నారట. అయితే, సతీదేవి అగ్నిగుండంలో పడి మరణించడంతో మహాదేవుడు కన్నీరు కార్చారనీ, ఆ కన్నీటితోనే ఒక నీటి కుంట ఏర్పడిందని చెబుతారు. చేసినపాపాలను కడిగేసుకోవడానికి భక్తులు ఈ కోనేరులో స్నానాలు చేస్తుంటారు. అయితే, పరిశ్రమలకోసం భూగర్భజలాలను విచ్చలవిడిగా వాడటంతో ఇప్పుడా కోనేరు పూర్తిగా ఎండిపోయింది.

దేశ విభజన సమయంలో పంజాబ్ రెండు ముక్కలైంది. తూర్పు పంజాబ్ ఇండియాలో భాగమైంది. అయితే ఈ విభజనలో అనేక అనర్థాలు చోటుచేసుకున్నాయి. పాకిస్తాన్ లోని పశ్చిమ పంజాబ్ లో ఉన్న హిందువులు పెట్టాబేడా సర్దుకుని ఇండియాకు వచ్చేశారు. అప్పటి నుంచి పాకిస్తాన్ పంజాబ్ లోని ఆలయాలు, మందిరాలు పూజాపునస్కారాలకు నోచుకోక శిథిలావస్థకు చేరుకున్నాయి. అలాంటి వాటిలో ఈ ప్రసిద్ధి చెందిన కతాస్ రాజ్ ఆలయం కూడా ఉంది. భారత – పాకిస్తాన్ సంబంధాలను బట్టి ఏటా కొంతమంది భక్తులు పాకిస్తాన్ కు వెళ్ళి ఈ ఆలయాన్ని సందర్శించుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది సాహసయాత్రే. మతసామరస్యం దెబ్బతింటే అనేక ఇబ్బందులను ఎదుర్కోకతప్పదు. అయినప్పటికీ పరమ పవిత్రమైన ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని భక్తులు బయలుదేరతారు. అలాగే ఈసారి 124మందితో కూడిన బృందం అక్కడకు వెళ్ళింది. భక్తులకు సౌకర్యాలు కల్పించడం, ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టడంలో పాకిస్తాన్ ప్రభుత్వం శ్రద్ధ చూపుతోంది. 2007లో ఈ ఆలయ ప్రాంగణానికి ప్రపంచ సాంస్కృతిక వైభవం తీసుకురావాలని పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తూ, నామినేట్ చేసింది. ఇరుదేశాల ప్రభుత్వాలు శాంతి స్థాపన చేయగలిగితే, ప్రజల్లో ప్రేమానురాగాలు మరింత పెరుగుతాయనడానికి ఇదే నిదర్శనం. `దేశ విభజన అనే విషాద సంఘటన జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు హృదాయాలను ఇచ్చిపుచ్చుకోవడం చకచకా జరిగిపోవాలని చాలా మంది ఆశిస్తున్నార’ని ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ చైర్ పర్సన్ మహమ్మద్ సిద్గికుల్ ఫరూక్ అంటున్నారు. 2005లో అద్వానీ ఈ ఆలయప్రాంగణాన్ని సందర్శించారు.

క్రిందటేడాది 84 మందితో కూడిన భక్తబృందం ఈ అలయాన్ని దర్శించుకుంది. ఈ ఏడాది ఈ సంఖ్య 124కి పెరిగింది. అప్పటికన్నా ఇప్పుడు భక్తులకు సౌకర్యాలు మెరుగయ్యాయని యాత్రికునిగా వచ్చిన శివ్ ప్రతాప్ బజాజ్ చెప్పారు. దేశ సరిహద్దుల వద్ద ఉన్నవారు రోజూ మార్నింగ్ వాక్ లో భాగంగా అటునుంచి ఇటు, ఇటునుంచి అటు వెళ్ళగలిగే రాజురావాలని ఈ భక్త బృందం భావిస్తోంది. భారత్ నుంచి ప్రయాణం చేస్తునంతసేపు, తమను పాకిస్తాన్ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఆందోళన చెందామని అంటున్నారు. అయితే వారు సరిహద్దుల వద్దకు రాగానే ఘన స్వాగతమే ఎదురైంది. భారత్-పాక్ నడుమ సాంస్కృతిక బంధం చాలా పటిష్టంగా ఉంది. కాకపోతే, రెండు దేశాల నడుమ రాజకీయ బంధం పటిష్టకావడంలోనే తీవ్ర జాప్యం జరుగుతుందన్నది వీరి భావన. అందుకే ఈ భక్త బృందం ఇరు దేశాలమధ్య శాంతి, స్నేహవాతావరణం కోసం ఆ పరమేశ్వరుని ఎదుట ప్రార్థనలు చేశాయి. వారి ప్రార్థనలను ఫలించాలని కోరుకుందాం.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close