హిప్పీ సమీక్ష

తెలుగు360 రేటింగ్‌: 1.5/5

  • ఆర్ ఎక్స్ 100 అనే హిట్ సినిమా బ్యాక్ గ్రవుండ్..
  • సిక్స్ ఫ్యాక్, ఛాతీ మీద టట్టూలు
  • హిప్పీ టైటిల్ ఇవి సరిపోతాయి సినిమాకి అనుకున్నారేమో? అలాగే ముందుకు వెళ్లిపోయారు. ఇవన్నీ సినిమాకు జనాలను తొలి రోజు లాగడానికి సరిపోతాయి. కానీ సినిమా ను నిలబెట్టడానికి విషయం అనేది ఒకటి వుండాలి.

సినిమాకు కథ అనేది అత్యంత అవసరం అయిన దినుసు కాకపోవచ్చు. సన్నివేశాల సమాహారంగా సినిమాను మలిచే అవకాశం కూడా వుంది. కానీ పూలదండలో కనిపించని దారం దాగున్నట్లు సన్నివేశాలన్నీ కలిపి మాంచి అల్లిక అవసరం వుంటుంది. ఆ అల్లిక అనేది లేకపోతే, సన్నివేశాలు దేనికవే వస్తుంటాయి.పోతుంటాయి. అందువల్ల టోటల్ గా ఓ పూర్తి సినిమా చూసిన సంతృప్తి కలగదు.

ఈకాలం అమ్మాయిలు, అబ్బాయిలు, అపోహలు, ఆరాటాలు, మధ్యలో ముద్దులు మురిపాలు, లివింగ్ రిలేషన్ షిప్ లు, పక్కదారి పట్టించే ఆలోచనలు, అడ్డగోలు స్నేహాలు. వెరసి హిప్పీ సినిమా.

హిప్పీ (కార్తికేయ) ఓ అమ్మాయితో క్యాజువల్ లవ్ లో వుంటాడు అంతలోనే దివ్య (దివ్యాంగన) ను చూసి ప్రేమిస్తాడు. ఈమెను వదిలి ఆమె వెంట పడతాడు. అప్పటి నుంచి అతగాడి లైఫ్ మొత్తం దివ్య కంట్రోల్ లోకి వెళ్లిపోతుంది. కానీ మళ్లీ అలా వెళ్లిపోయిన సంగతి తెలుసుకుని, మళ్లీ మారాలని, దివ్యను వదిలించుకోవాలని ప్రయత్నిస్తాడు హిప్పీ. అప్పుడేం జరిగింది అన్నది మిగిలిన సినిమా. ఇంతకన్నా ఒక్క ముక్క కూడా ఈ సినిమా కథ గురించి చెప్పడం కష్టమే.

అమ్మాయి..అబ్బాయి..ప్రేమ..ఆవేశం, అపార్థం, ఇగోలు, ఇలాంటి వ్యవహారాలు మిక్స్ చేస్తూ చాలా సినిమాలే వచ్చాయి. అలాంటి సినిమాలో హిట్ అయిన వాటి అన్నింటికి బలం, హీరో హీరోయిన్ల మధ్య దర్శకుడు రాసుకున్న కెమిస్ట్రీ. అది వర్కవుట్ అయిన విధానం. హిప్పీకి ప్రధాన సమస్య అదే. హీరో హీరోయిన్లు ఎక్కడా సిసలైన ప్రేమికుల్లా కనిపించరు. పక్కా టైమ్ పాస్ వ్యవహారంగా వుంటుంది. అందువల్ల వాళ్ల సమస్య ప్రేక్షకుడికి పట్టదు. ఎప్పుడయితే వాళ్ల సమస్య ప్రేక్షకుడికి పట్టదో సినిమాతో కనెక్ట్ కాడు. అందవల్ల సీన్లు వస్తుంటాయి. కాస్త ఫన్ వుంటే ఎంజాయ్ చేస్తుంటాడు. లేదంటూ కళ్లప్పగించి మరో సీన్ కోసం వెయిట్ చేస్తాడు.

సినిమా ఇలా అనిపించడానికి కారణం, దర్శకుడు సినిమాలో సన్నివేశాలకు బలమైన ఫౌండేషన్ వేయలేకపోవడమే. ఒక పక్కా క్లారిటీ గల లీడ్ సన్నివేశాలు ఒకటి రెండు వేసి, సినిమాను ఓ లైనూ లెంగ్త్ లో నడిపితే ప్రేక్షకులకు క్లారిటీ వుంటుంది. తెరపై నడుస్తున్న స్ట్రగుల్ ను వాళ్లు కూడా ఫీలవుతారు.

ప్రేమించానంటాడు. లేపుకు వెళ్లిపోతాడు. రోడ్డు పక్క మైలు రాయి మీదే కూర్చుని అమ్మాయితో వీర లెవెల్లో రొమాన్స్ చేసేస్తాడు. అలా చేస్తూనే మరో అమ్మాయిని చూసి లొట్టలేస్తాడు. మరి ఆ హీరో ఫీలింగ్ ల మీద, ప్రేమ మీద ప్రేక్షకుడికి ఇన్ వాల్వ్ మెంట్ ఎక్కడ నుంచి వస్తుంది?

ఇదిలా వుంటే హీరో క్యారెక్టరైజేషన్ నే సరిగ్గా లేదు. హిప్పీ అంటాడు. విచ్చలవిడిగా వుంటాడు. కానీ మళ్లీ ప్రేమించిన అమ్మాయి గీసిన గీత దాటకుండా కిందా మీదా అయిపోతుంటాడు. ఈ లోగా ఆఫీస్ లో బాస్ (జెడి చక్రవర్తి) ఒకడు. నానా బోధలు చేస్తుంటాడు. ప్రారంభంలో పక్కా కాసనోవా గా కనిపించిన వాడు అమ్మాయి లివింగ్ రిలేషన్ షిప్ లో వున్నా, పక్కలోనే పడుకున్నా, రాముడు మంచి బాలుడు అన్నట్లు వుంటాడు. అలాంటి వాడు క్లయిమాక్స్ లో అమ్మాయి ఏదో అందని, మీదపడిపోయి వీరవిహారం చేసేస్తాడు. ఇదో అద్భుతమైన క్లయిమాక్స్ అని, ఇదంతా యూత్ ఫుల్ సినిమా అని, కుర్రకారుకే నచ్చుతుందని మేకర్లు ఆత్మవంచన చేసుకుంటే చేసేదేమీ లేదు.

పోనీ హీరో హీరోయిన్ల మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ అయినా పెర్ ఫెక్ట్ గా రన్ చేసారా? అంటే అదీ లేదు. పైగా అనవసరపు ఆఫీసు సీన్లు ఒకటి.

వీటన్నింటకి మించి మరోటి వుంది. ద్వందార్ధపు డైలాగులు విచ్చలవిడిగా వాడేసారు. అవి థియేటర్లో కాస్త నవ్వులు పూయిస్తే పూయించి వుండొచ్చు గాక, కానీ సినిమా మీద ప్రేక్షకుడికి ఒక స్థిరమైన అభిప్రాయం కలగకుండా చేసాయి.

నిజానికి దర్శకుడు ఈకాలం కుర్రకారు పోకడలు, ఈగోలు, ఆలోచనలు అన్నీ తెరెకెక్కింద్దాం అంటూ చేసిన ఆలోచన వరకు ఒకె. దాన్ని స్క్రీన్ మీదకు అనువదించడంలోనే సరైన మార్గంలో వెళ్లలేదు. అయితే చాలా వరకు ఫన్ సీన్లు మాత్రం పండాయి. ఈమధ్య వెన్నెల కిషర్ చక్కిలిగింతలు పెట్టిన సినిమా రాలేదు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ఆ లోటు తీర్చాడు.

సినిమా నిండా డబుల్ మీనింగ్ డైలాగులు విచ్చలవిడిగా వాడేసారు. జెడి చక్రవర్తి కనిపించిన ఎపిసోడ్ లు అన్నీ చికాకుపెడతాయి. పాటల ప్లేస్ మెంట్ ఓ మాదిరిగా వుంది. కానీ అడియో పెద్దగా ఆకట్టుకోక, ఆ ఫ్లేస్ మెంట్ కూడా రాంగ్ అనిపిస్తుంది.

కార్తికేయ గుమ్మకొండ హీరోగా రకరకాల హావభావాలు ప్రదర్శించడంతో పాటు సిక్స్ ప్యాక్ ప్రదర్శనకు, ప్లేబాయ్ అవతారానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తుంది. తన పాత్ర మేరకు తాను బాగానే చేసాడు. దివ్యాంగన కు పెద్దగా మార్కులు రావు. జెడి చక్రవర్తిని చూస్తే, ఈయనా మారలేదు, ఈయన పాత్రలు మారలేదు. యాక్టంగ్ మారలేదు అనిపిస్తుంది. గోవా లోకేషన్లలో తప్పిస్తే సినిమా మరెక్కడా రిచ్ లుక్ అని అనిపించుకోదు.కథ మీద పెద్దగా సీరియస్ నెస్ లేకుండా, ఏదో రెండు గంటలు థియేటర్లో కూర్చుందాం, డబుల్ మీనింగ్ డైలాగులకు కాస్త సరదా పడదాం, నవ్వు వస్తే నవ్వుదాం అనుకున్న వాళ్లకు సరిపోతుంది. సీరియస్, సిన్సియర్ సినిమా లవర్స్ కు సరిపోదు

ఫినిషింగ్ టచ్…కథ విడిచి సాము

తెలుగు360 రేటింగ్‌: 1.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శంకించొద్దు.. జగన్‌కు విధేయుడినే : విజయసాయిరెడ్డి 

తాను చనిపోయేవరకు జగన్‌కు, ఆయన కుటుంబానికి విధేయుడిగానే ఉంటానని.. నన్ను శంకించాల్సిన అవసరం లేదని ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా ముఖంగా వెల్లడించారు. వైఎస్ జగన్ కు... అత్యంత ఆప్తునిగా పేరు తెచ్చుకున్న ఆయన...

అమిత్‌షాతో భేటీకి మంగళవారం ఢిల్లీకి జగన్..!?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం అత్యవసరంగా ఢిల్లీకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మీడియా ప్రతినిధులకు అనధికారిక సమాచారం అందింది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తారని.. కేంద్ర హోంమంత్రి అమిత్...

పెద్ద హీరోలు ఓటీటీకి ఒప్పుకోరు

వెండి తెర - ఓటీటీ .... వీటి మ‌ధ్య గ‌ట్టి పోటీ ఎదురైంది. థియేట‌ర్లు మూసిన వేళ‌లో, సినిమాల్ని లాక్కోవాల‌ని ఓటీటీ ఆరాట‌ప‌డుతోంది. ఎలాగైనా స‌రే, థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌ని కాపాడుకోవాల‌ని సినిమాల్ని వెండి...

మ‌హేష్ – పూరి.. మ‌ళ్లీ క‌లిసిపోయారు

టాలీవుడ్‌లోని క్రేజీ కాంబినేష‌న్ల‌లో మ‌హేష్‌బాబు - పూరి జ‌గ‌న్నాథ్‌ల జోడీ త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. వీళ్లిద్ద‌రూ క‌లిస్తే.. బాక్సాఫీసు ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది పోకిరితో రుజువైంది. బిజినెస్‌మేన్ కూడా బ్యాడ్ సినిమా ఏం కాదు. అందులో...

HOT NEWS

[X] Close
[X] Close