‘హిట్’ ల‌క్ష‌ణాలున్నాయ్‌!

థ్రిల్ల‌ర్ ఎప్పుడూ ఆక‌ర్షించే జోన‌రే. బ‌హుశా…. థ్రిల్ల‌ర్‌ని ఇష్ట‌ప‌డే వ‌ర్గం త‌క్కువ కావొచ్చు. కానీ.. ఓ మంచి థ్రిల్ల‌ర్ సినిమా వ‌స్తే – థియేట‌ర్లు నిండుతాయ‌న్న భ‌రోసా మాత్రం కావ‌ల్సినంత ఉంది. అందుకే ఈ జోన‌ర్‌ని ఎప్పుడూ ఎవ‌రూ వ‌ద‌ల‌డం లేదు. నిర్మాత‌గా నాని వ‌రుస‌గా రెండోసారీ థ్రిల్ల‌ర్ క‌థ‌నే ఎంచుకున్నాడు. అదే.. `హిట్‌`. విశ్వ‌క్‌సేన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈచిత్రం శుక్ర‌వారం విడుద‌ల కానుంది. హిట్ కి సంబంధించి టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఎప్పుడో వ‌చ్చేశాయి. ఇప్పుడు 5 నిమిషాల నిడివి గ‌ల ఓ సీన్ కూడా బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. క‌థానాయ‌కుడు ఓ శ‌వానికి సంబంధించిన అన్వేష‌ణ ఎలా చేశాడు? మిస్ట‌రీని ఎలా రాబ‌ట్టాడు అనే సీన్ అది. అందులో మిస్ట‌రీ గుట్టు పూర్తిగా విడ‌కుండానే క‌ట్ చెప్పేశాడు ద‌ర్శ‌కుడు. ఆ మిస్ట‌రీ ఏమిట‌న్న‌ది సినిమా చూస్తే గానీ అర్థం కాదు. మొత్తానికి జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డానికి ఇది మంచి టెక్నిక్ అనుకోవాలి. ఈ 5 నిమిషాల ఎపిసోడ్‌లో టేకింగు, షాట్ డివిజ‌న్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌… ఇవ‌న్నీ చూస్తే.. హిట్ ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్టే క‌నిపిస్తున్నాయి. పూర్తిగా బొమ్మ ప‌డితే గానీ.. జాత‌కం అర్థం కాదు. చూద్దాం.. శుక్ర‌వారం రిపోర్ట్ ఎలా ఉంటుందో??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close