ఇల్లు కొనాలంటే చిన్న విషయం కాదు. జీతాన్ని, జీవితాన్ని పదిహేను, ఇరవై ఏళ్ల పాటు ఈఎంఐలకు అంకితం చేయాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో కనీసం లక్ష జీతం సంపాదించేవారు మాత్రమే హోమ్ లోన్ తో ఇల్లు కొనే సాహసం చేయగలరు. మరి లక్ష జీతం అందుకునేవారికి రూల్స్ ప్రకారం లోన్ ఎంత వస్తుంది.? లక్ష రూపాయల జీతం అందుకునేవారు హోమ్ లోన్ ఎంత వస్తుందన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. చేతికి వచ్చే జీతం), క్రెడిట్ స్కోర్, రుణ వ్యవధి , వడ్డీ రేటు, ఇతర ఈఎంఐలు, రుణాలు వంటి వాటి ఆధారంగా నిర్ణయమవుతుంది.
బ్యాంకులు సాధారణంగా నీట్ ఇన్‌కం అంటే చేతికి అందే జీతం ఆధారంగా రుణం కేటాయిస్తాయి. బ్యాంకులు సాధారణంగా నీట్ ఇన్‌కంలో 50 నుంచి 60 శాతం వరకూ ఈఎంఐ కట్టేందుకు అనుమతిస్తాయి. అంటే రూ. 80,000 నీట్ ఇన్‌కం ఉంటే, EMI సుమారు రూ. 40,000 నుండి రూ. 48,000 వరకు ఉండవచ్చు. కొన్ని బ్యాంకులు మల్టిప్లియర్ పద్ధతిని ఉపయోగిస్తాయి. ఇలాంటి బ్యాంకులు కాస్త ఎక్కువగా రుణం ఇస్తాయి. అంటే రూ. 45 నుంచి 55 లక్షల వరకు గరిష్ఠంగా హోంలోన్ వస్తుంది.
క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే, ఎక్కువ రుణ మొత్తం , తక్కువ వడ్డీ రేటు లభిస్తాయి. ఇతర EMIలు లేదా ఆర్థిక బాధ్యతలు ఉంటే, అవి నీట్ ఇన్‌కం నుండి తగ్గిస్తారు. దీనివల్ల రుణ మొత్తం తగ్గుతుంది. బ్యాంకులు సాధారణంగా ప్రాపర్టీ విలువలో 75 నుంచి 90 శాతం వరకు రుణం ఇస్తాయి. అంటే 60 లక్షల ప్రాపర్టీ కొనాలనుకుంటే రూ. 48 నుంచి 54 లక్షల వరకు రుణం లభిస్తుంది. మిగిలినది డౌన్ పేమెంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది.