మత మార్పిళ్లు నేరం కాదంటున్న ఏపీ మంత్రి..!

మత మార్పిళ్లు నేరమా.. అని ఏపీ మంత్రి సుచరిత పవన్ కల్యాణ్‌కు సూటిగా ప్రశ్నించారు. దుర్గమ్మ సన్నిధిలో.. కృష్ణానదిలో.. మత మార్పిళ్లు చేస్తున్న వీడియో ఒకటి.. హల్ చల్ చేసింది. గుడికి వస్తున్న వారిని టార్గెట్‌గా చేసి మత మార్పిడికి పాల్పడుతున్నారని.. ఇదంతా.. ఎవరి అండతో జరుగుతోందని..పవన్ కల్యాణ్.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగ విరుద్ధమని..సూడో సెక్యూలరిస్టులంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై.. మంత్రి సుచరిత ఉలిక్కిపడ్డారు. మత మార్పిడి చేసుకోవడం నేరమా? ఇష్ట ప్రకారం మతమార్పిడి చేసుకుంటే తప్పేంటని పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు.

మత మార్పిళ్ల అంశంపై.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు.. సుచరిత ఉలిక్కి పడటానికి కారణం ఉంది. ఆమె కూడా కన్వర్టడ్ క్రిస్టియన్. అయితే.. ఎస్సీ రిజర్వేషన్ ఉన్న ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఓ యూ ట్యూబ్ చానల్ ఇంటర్యూలో.. తాను.. క్రిస్టియన్ మతం తీసుకున్నానని నేరుగా చెప్పారు. నిజానికి.. ఆమె అలా క్లెయిమ్ చేసుకోక ముందే.. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి విషయంలో… రగడ జరుగుతోంది. ఆమె కూడా క్రిస్టియన్ మతం తీసుకుని ఎస్సీగా చెప్పుకుని.. పోటీ చేశారు. విజయం సాధించారు. ఆమెపై రాష్ట్రపతికి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. విచారణ జరుగుతున్నప్పటికీ.. తమ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి.. వారు ధైర్యంగా.. క్రిస్టియన్స్ మి అని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. అధికారికంగా మాత్రం.. ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు సమర్పిస్తున్నారు.

స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా.. కన్వర్టడ్ క్రిస్టియన్. రిజర్వుడు నియోజకవర్గాల్లో అనేక మందికి.. టిక్కెట్లు ఇచ్చిన వారంతా.. కన్వర్టడ్ క్రిస్టియన్స్ అన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మత మార్పిళ్లు పెరిగిపోయాయని… విమర్శలు వస్తున్న సమయంలో.. మంత్రులు.. మత మార్పిళ్లను సమర్థిస్తున్నారు. ఇష్టమైన మాత మార్పిడి చేయించుకుంటున్నారని వాదిస్తున్నారు. జగన్ మీడియాలో… కూడా.. మత మార్పిళ్లు తప్పేమి కాదని.. ఆర్టికల్స్ ప్రచురిస్తున్నారు. ఇవన్నీ.. వివాదాస్పదమవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమరావతిని కొనసాగిస్తే పదవుల్ని ఇచ్చేస్తాం..! జగన్‌గు చంద్రబాబు ఆఫర్..!

అమరావతిని ఏకైక రాజధాని కొనసాగిస్తూ... ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే... తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవులను వదిలేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు.. ముఖ్యమంత్రి జగన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు...

జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్..!

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాతి రోజే...అంటే జూన్ 13న హైదరాబాద్‌లో వారిని అరెస్టు చేసిన పోలీసులు అనంతపురంకు తరలించారు....
video

క‌ల‌ర్ ఫొటో టీజ‌ర్‌: బ్లాక్ అండ్ వైట్ కాంబో

https://www.youtube.com/watch?v=T-R3h9va2j4&feature=emb_title ప్రేమ గుడ్డిది. చెవిటిది. మూగ‌ది కూడా. దానికి ప్రేమించ‌డం త‌ప్ప బేధాలు తెలీవు. న‌ల్ల‌ని అబ్బాయి.. తెల్ల‌ని అమ్మాయి ప్రేమించుకోవ‌డం కూడా వింతేం కాదు. కానీ.. మ‌ధ్య‌లోకి ఓ పులి వ‌చ్చింది....

బ్రహ్మానందం ట్రాజెడీ

బ్ర‌హ్మానందం అంటేనే.. ఆనందం. ఆనందం అంటేనే బ్ర‌హ్మానందం. హాస్య పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ బ్ర‌హ్మీ. త‌న కామెడీ ట్రాక్ తోనే సినిమా హిట్ట‌యిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. అయితే ఇప్పుడు బ్ర‌హ్మానందం జోరు త‌గ్గింది....

HOT NEWS

[X] Close
[X] Close