వ్యాపారానికి వైరస్ : కోమాలోకి హాస్పిటాలిటీ ఇండస్ట్రీ..!

ఆతిధ్య సేవల రంగం.. హాస్పిటాలిటి కోవిడ్ -19 దెబ్బకు కోమాలోకి వెళ్లిపోయింది. ప్రపంచవ్యాప్తంగా హోటళ్లన్నీ మూతపడ్డాయి. ఎక్కడా ప్రయాణాలు లేవు.. ప్రయాణీకులు అసలే లేరు.. అధికారికంగానే ప్రభుత్వాలు ప్ర యాణాలపై నిషేధం విధించాయి. ప్రయాణాలే లేని టైంలో.. హాస్పిటాలిటీకి అసలు డిమాండ్ అనే మాటే వినిపించదు. ప్రస్తుతం ఓ మాదిరి లాడ్జింగ్ దగ్గర్నుంచి స్టార్ హోటళ్ల వరకూ అన్నీ కార్యకలాపాలు దాదాపుగా నిలిపివేశాయి. కొన్ని అరకొరగా సేవలు అందిస్తున్నప్పటికీ.. వాటి వల్ల అదనపు భారాన్నే భరిస్తున్నాయి.

హాస్పిటాలిటి బిజినెస్ అంతా క్యాన్సిల్..!

అంతర్జాతీయ మందగమనం ఉన్నా.. గత గతేడాదిలో హోటళ్లలో గదుల భర్తీ 65 శాతం ఉంది. దీంతో ఈ ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకుంది ఆతిధ్యరంగం. కోవిడ్ -19 వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి హాస్పిటాలిటీ రంగానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రయాణికులు పూర్తిగా తగ్గిపోవడంతో స్టార్‌ హోటళ్ల అక్యూపెన్సీ పడిపోయింది. ఇక మధ్య, చిన్న స్థాయి హోటళ్లు, లాడ్జీల సంగతి చెప్పాల్సిన పని లేదు. స్టార్ హోటళ్లు ఎంత స్థాయిలో నష్టపోతాయో.. అంతకు మించి… దిగువ స్థాయి హాస్పిటాలిటీ సేవల వ్యాపారాలు నష్టపోతున్నాయి. సాధారణంగా వేసవి కాలం.. ప్రయాణాల సీజన్. పెద్ద ఎత్తున కుటుంబాలతో సహా..విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ముందస్తు బుకింగ్‌లు కూడా.., భారీగా ఉంటాయి. ఈ ఏడాది ఆశావహంగా ముందస్తు బుకింగ్‌లు ఉండటంతో… ఫిబ్రవరి వరకూ.. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఆశావాహంగానే ఉంది. కానీ.. కోవిడ్ విస్తరణ ప్రారంభం కావడంతో.. క్యాన్సిలేషన్స్ ఒక్క సారిగా పెరిగిపోయాయి. విహారానికి వచ్చే పర్యాటకులతో పాటు వ్యాపారం., విధుల్లో భాగంగా వచ్చే ఖాతాదారుల వల్లే హోటళ్లకు అధిక ఆదాయం వస్తుంటుంది. ఇప్పుడు ఈ పర్యటనలేమీ లేవు.

లక్షల ఉద్యోగాలకు గండం తెచ్చిపెట్టిన కోవిడ్..!

ప్రధాన విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు మూసేశారు. విదేశాల నుంచి పురుగు కూడా రాకుండా నిషేధం విధించారు. విదేశాల్లో దేశాల్లో క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకలు ముగిశాక, జనవరి-మార్చిలో వ్యాపార కార్యకలాపాలు ఊపందుకుంటాయి. అందువల్ల వ్యాపార పర్యాటకులతో ఇక్కడి హోటళ్లకూ ఆదాయం బాగుంటుంది. ఫిబ్రవరిలో దేశీయ హోటళ్లు విదేశీ అతిథులతో కళకళలాడుతుంటాయి. ఈ సారి ఆ వ్యాపారాలన్నీ కుప్పకూలిపోయాయి. గత మూడు త్రైమాసికాలుగా ఆతిధ్య రంగం వృద్ధి 4-5 శాతం ఉంది, ఇప్పుడు అది మైనస్‌లోకి వెళ్లే ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుతం ప్రపంచంలోని హోటళ్లన్నింటిలో కనీసం మూడు శాతం ఆక్యుపెన్సీ కూడా లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ప్రముఖుడు. అమెరికా, కెనడా దేశాల్లో ట్రంప్‌ వ్యాపార సంస్థలకు 2,200 గదులతో అత్యాధునిక 5స్టార్ హోటల్స్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఖాళీగా ఉన్నాయి. ఏడాది అమెరికాలోని అన్ని హోటల్స్ మాదిరి ట్రంప్ ఆర్గనైజేషన్ హోటల్స్ కూడా చాలామంది ఉద్యోగులను తొలగించింది. అదే పరిస్థితి అన్ని రకాల హాస్పిటాలిటీ వ్యాపారాల్లోనూ ఉంది.

వచ్చే ఐదేళ్లు భారీ లాభాలు చూసినా ఇప్పటి నష్టాలు తీరవు..!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ విధ్వంసం కొనసాగుతుంది. ఎప్పుడు నెమ్మదిస్తుంది.. దానిపై ప్రపంచం ఎప్పుడు విజయం సాధిస్తుందన్నది ఇప్పుడే చెప్పలేం. కోవిడ్ వ్యాప్తి ఆగిపోయిన తర్వాత కూడా.. వెంటనే మళ్లీ ప్రయాణాలు..విమానాలు.. వ్యాపారాలు ప్రారంభం కావు. మళ్లీ ఎటు వైపు నుంచి దాడి చేస్తుందన్న భయం అందరిలోనూ ఉంటుంది.అందుకే.. మొదట ఆంక్షలు అలాగే ఉంచుతారు. కొద్ది కొద్దిగా సడలించుకుంటూ పోతారు కాబట్టి.. హోటల్ పరిశ్రమకు ఈ ఆర్థిక సంవత్సరం మొత్తంత కష్టాలు తప్పవు. అయితే.. కార్యకాలాపాలు జరుగుతూ నష్టాలు వస్తేనే దివాలా స్థితికి చేరే హోటళ్లు.. ఇప్పుడు అసలు ఏమీ వ్యాపారాలు చేయకుండా.. నెలల తరబడి సర్వైవ్ కావడం కష్టం. అందుకే.. హోటల్ ఇండస్ట్రీ ఇప్పుడు ప్రభుత్వాల వైపు చూస్తున్నాయి. కోవిడ్ దెబ్బకు పూర్తిగా దెబ్బతినే వ్యాపారాల్లో హాస్పిటాలిటి ఒకటి. ఓ రకంగా కోమాలోకి వెళ్లిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close