భవిష్యత్ కోసం ఎక్కడైనా ఓ స్థలం కొని పెట్టుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వారు మంచి గ్రోత్ ఉండే.. తక్కువ ధరలకు లభించే ప్రాంతాల గురించి వాకబు చేస్తూంటారు.
హైదరాబాద్ శివారు అంటే.. ఇప్పుడు ఓఆర్ఆర్ దాటి ఇరవై కిలోమటీర్ల వరకూ ఉంటుంది. షాద్నగర్ ఇప్పుడు శివారు ప్రాంతంగా మారింది. అక్కడ గజం పది వేల నుంచి ఇరవై వేల మధ్యలో లభిస్తున్నాయి. అలాగే ఆదిభట్ల లోనూ ఇదే ధరలో వస్తున్నాయి. శ్రీశైలం హైవే సమీపంలో ఉండటం ప్లస్ పాయింట్. గత మూడు సంవత్సరాలలో ధరలు దాదాపుగా డబుల్ అయ్యాయి. అలాగే శీశైలం హైవేపై మహేశ్వరం వద్ద కూడా స్థానిక రియల్టర్లు వేసే వెంచర్లలో పదివేల లోపు గజం ధరకు లభిస్తున్నాయి.
పశ్చిమ హైదరాబాద్లో ఉన్న శంకర్పల్లిలో కూడా ఇళ్ల స్థలాలు తక్కువనే లభిస్తున్నాయి. పటాన్చెరు, ఔటర్ రింగ్ రోడ్ (ORR) , ముంబై హైవేకు సమీపంలో గజం పాతిక వేల రూపాయలకు గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్లు లభిస్తాయి దక్షిణ హైదరాబాద్లో, విమానాశ్రయానికి సమీపంలో ఉన్న తుక్కుగూడు కూడా ఇంకా అభివృద్ధి దశలో ఉంది. తక్కువ ధరలతో విల్లాలు , ప్లాట్లు లభిస్తాయి.
హైదరాబాద్ శివారులో తక్కువ ధరలతో స్థలాలు షాద్నగర్, అడిబట్ల, మహేశ్వరం, శంకర్పల్లి, కొంపల్లి, పటాన్చెరు వంటి ప్రాంతాల్లో లభిస్తాయి. హెచ్ఎండీఏ ఆమోదం ఉన్న లే ఔట్లను కొనడం శ్రేయస్కరం.