ఏపీ పేదల్లో “ఓటీఎస్” అలజడి ! ప్రభుత్వానికి దయ లేదా ?

ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం ఎక్కడకిక్కడ నిధులు సమీకరిస్తోంది. అప్పులు.. ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇలా దేన్నీ వదిలి పెట్టడం లేదు. అయితే ఇప్పుడు ప్రజల్నీ బాదేయడం అనూహ్యంగా మారింది. నిరుపేదల్ని రూ. పది నుంచి రూ. ఇరవై వేల వరకు కడతారా చస్తారా అన్నట్లుగా బెదిరింపులకు దిగడం అనూహ్యంగా మారింది. వన్ టైం సెటిల్మెంట్ పేరుతో పేదల వద్దకు వెళ్లి వాలంటీర్లు..ఇతర అధికారులు చేస్తున్న హంగామాతో వారంతా హడలి పోతున్నారు. తమ దగ్గర డబ్బులెక్కడివని.. వారు వాలంటీర్ల కాళ్లా వేళ్లా పడుతున్నారు. అయినా ఎవరూ వినిపించుకోవడంలేదు. దీంతో పేదలు నలిగిపోతున్నారు.

ఏపీ ప్రభుత్వం ఇటీవల వన్ టైమ్ సెటిల్మెంట్ అనే పథకాన్ని ఆమోదిచింది. ఈ పథకం ప్రకారం గతంలో ప్రభుత్వ ఇళ్లను పొందిన పేదలు గ్రామీణ ప్రాంతాల్లో రూ. పది వేలు.. పట్టణ ప్రాంతాల్లో రూ. ఇరవైలు కట్టాలని ఆదేశిచింది. అలా కడితే ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషనే ఇస్తామని చెబుతోంది. ఇలా ఏపీలో 46 లక్షల మందిని గుర్తించారు. అందరూ నిరుపేదలే. అందుకే వారికి ప్రభుత్వాలు ఇళ్లు కేటాయించాయి. వారందరికీ వన్ టైం సెటిల్మెంట్ పథకం అమలు చేయాలని కేబినెట్‌లో నిర్ణయించారు.

అయితే ఈ ఇళ్లు జగన్మోహన్ రెడ్డి సర్కారులోనే.. వైఎస్ హయాంలోనో ఇచ్చినవి కావు.1983లో ఎన్టీఆర్ ప్రభుత్వం ఇచ్చినప్పటి నుండి లెక్కలేస్తున్నారు. ప్రభుత్వ ఇళ్లు సగం సొమ్ము సబ్సిడీగా మిగతా సగం సొమ్ము లబ్దిదారులు రుణంగా ఇళ్లు ఇస్తారు. ఆ సగం సొమ్మును లబ్దిదారులు పది లేదా ఇరవై ఏళ్ల వాయిదాల్లో చెల్లించాలి. అయితే ఇళ్లను తీసుకుంటున్న లబ్దిదారులు ప్రభుత్వమే కదా అని చెల్లించడం లేదు. ప్రభుత్వాలు కూడా లైట్ తీసుకున్నాయి. అడగడం మానేశాయి.

ఇప్పుడు వారి నుంచి ఆ అప్పులు వసూలు చేయాలని జగన్ నిర్ణయించారు. అయితే ఈ పథకం వల్ల పేదలపై భారం పడదని.. వారు ఈ పథకంలో భారీగా లబ్దిపొందుతారని అంటున్నారు. అసలు పేదలు కిస్తీలు కట్టడం మానేసిన ఏళ్ల తర్వాత వాటిని మాఫీ చేయాల్సింది పోయి వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ఎప్పుడో తీసుకున్న రుణాలను ఈ ప్రభుత్వం వసూలు చేయడం ఏమిటన్నది అందరి డౌట్. కానీ ప్రభుత్వం మాత్రం.. ముక్కు పిండి వసూలు చేస్తోంది. కట్టని వారి ప్రభుత్వ పథకాలు రద్దు చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close