దేశంలోని ప్రధాన 9 నగరాల్లో ఇళ్ల విక్రయాలు 4 శాతం తగ్గినప్పటికీ, హైదరాబాద్ మార్కెట్ మాత్రం గణనీయమైన రికవరీ చూపిస్తోంది. NSE-లిస్టెడ్ రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ ఫర్మ్ ప్రాప్‌ఈక్విటీ ( విడుదల చేసిన తాజా రిపోర్ట్ ప్రకారం, జులై-సెప్టెంబర్ 2025 క్వార్టర్లో (Q3 2025) హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు గత సంవత్సరం అదే కాలంతో పోలిస్తే 4 శాతం పెరిగి 12,860 యూనిట్లకు చేరాయి. దేశవ్యాప్తంగా అమ్మకాలు తగ్గితే హైదరాబాద్‌లో పెరుగుతున్నాయి.
హైదరాబాద్ వంటి నగరాల్లో IT సెక్టార్, మెట్రో ఎక్స్పాన్షన్ వంటి అంశాలు డిమాండ్‌ను పెంచుతున్నాయని ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. హైదరాబాద్‌లోని వెస్ట్ రీజియన్ లో గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలు లో హై-ఎండ్ ఇళ్లపై డిమాండ్ పెరగడంతో పాటు మధ్య-స్థాయి ఫ్యామిలీలకు అనుకూలమైన రేట్లను రియల్టర్లు గుర్తించారని అంటున్నారు. రిపోర్ట్ ప్రకారం, గత క్వార్టర్‌తో పోలిస్తే (QoQ) కూడా హైదరాబాద్ విక్రయాలు 14 శాతం పెరిగాయి. ఇదే సమయంలో ముంబై, పూణే వంటి నగరాల్లో 10-15 శాతం తగ్గుదల నమోదు అయింది.
హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో మాత్రమే పెరుగుదల నమోదు అయింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2025-26లో మరింత బలపడి, 10-20 శాతం ధర పెరుగుదల చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ పెరుగుదల, హైదరాబాద్‌ను దక్షిణ భారత రియల్ ఎస్టేట్ హబ్‌గా మార్చుతోందనే ఆశాభావాన్ని రేకెత్తిస్తోంది.