డబుల్ బెడ్ రూం, త్రిబుల్ బెడ్ రూం ఇళ్ల గురించి అందరికీ తెలుసు. కానీ ఇటీవలి కాలంలో రెండున్నర , మూడున్నర BHK ఇళ్లు ఎక్కువగా అందుబాటులోకి వస్తున్నాయి . ఈ అర పర్సంట్ ఏమిటో చాలా మందికి అర్థం కావడం లేదు. 2 BHK ఇంటిలో 2 పూర్తి స్థాయి పడక గదులు , 1 హాల్ , 1 కిచెన్. BHK అంటే బెడ్ రూం, హాల్ , కిచెన్. వీటి అదనంగా చిన్న గది ఉంటే దాన్ని 2.5 BHK అని పిలుస్తున్నారు. ఈ “.5” గది సాధారణంగా పూర్తి పడక గది కంటే చిన్నదిగా ఉంటుంది.
స్టడీ రూమ్ గెస్ట్ రూమ్ , పిల్లల ఆట గది, స్టోరేజ్ రూమ్, చిన్న హోమ్ ఆఫీస్ వంటి వాటికి ఉపయోగపడుతుంది. ఈ “.5” గది అదనపు స్థలాన్ని అందిస్తుంది, ఇది వివిధ అవసరాలకు ఉపయోగపడుతుంది. 3 BHK లేదా 4 BHK కంటే 2.5 లేదా 3.5 BHK ఇళ్ల ధరలు పెద్దగా తేడా లఉండవు. హైదరాబాద్లో ఇలాంటి ఇళ్లకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది.
మారుతున్న జీవనశైలి కారణంగా ప్రతి కుటుంబానికి అదనంగా కొంత స్పేస్ అవసరం అవుతోంది. గెస్టులు వచ్చినప్పుడు లేదా ఇతర కారణాలు, వర్క్ ఫ్రం హోం చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. అందుకే.. 2.5 , 3.5 BHKలకు డిమాండ్ పెరుగుతోంది. బిల్డర్లు కూడా నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.